Bigg Boss Nominations : పీక్కో, బొంగు.. పగిలిపోద్ది.. బాబోయ్ బిగ్ బాస్ లో ఇవేం బూతులు..!

NQ Staff - October 25, 2023 / 09:39 AM IST

Bigg Boss Nominations : పీక్కో, బొంగు.. పగిలిపోద్ది.. బాబోయ్ బిగ్ బాస్ లో ఇవేం బూతులు..!

Bigg Boss Nominations : బిగ్ బాస్ ను చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అందరూ చూస్తారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఇది ఫేవరెట్ షో. ఇలాంటి షోలో రోజురోజుకూ వల్గారిటీ బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా రోజురోజుకూ బూతులు మాట్లాడేవారు బాగా పెరుగుతున్నారు. ఆవేశంలో ఒక్కోసారి ఏం పీక్కుంటావో పీక్కో, పగిలిపోద్ది, బొంగు ఇలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. కొన్ని సార్లు వారు మాట్లాడే మాటలను చూపించలేక బిగ్ బాస్ బీప్ సౌండ్స్ వేసుకోవాల్సి వస్తోంది. ఇక తాజాగా నామినేషన్లు వాడి వేడిగా జరిగాయి. అందులో ముఖ్యంగా.. సందీప్, అమర్ దీప్, యావర్, భోలే, గౌతమ్, ప్రశాంత్.. రెచ్చిపోయి బూతులు మాట్లాడారు.

ముఖ్యంగా సందీప్, అమర్ అయితే దారుణమైన బూతులు మాట్లాడేసారు. వీరిలో శివాజీ ఒక్కటే కాస్త హుందాగా గొడవలు లేకుండా నామినేషన్స్ జరిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎప్పటిలాగానే ఈ సారి కూడా చిల్లర వాదనలు ఎక్కువ అయిపోయాయి. అయితే ముందుగా వచ్చిన అమర్ దీప్ వచ్చి శివాజీతో గొడవ పడడ్ఆడు. ఆ తర్వాత భోలేతో కాస్త ఘాటుగానే వాదనలకు దిగాడు. ఆ తర్వాత వచ్చిన ప్రశాంత్ గౌమ్ ను నామినేట్ చేశాడు. దాంతో ఇద్దరి నడుమ తీవ్రమైన వాదన జరిగంది. ఆ తర్వాత అమర్ దీప్ ను కూడా నామినేట్ చేశాడు ప్రశాంత్.

దాంతో ఇద్దరి నడుమ తీవ్రమైన వాగ్వాదం జరిగింది. మ ధ్యలోకి ఇతర కంటెస్టెంట్లను కూడా లాగి అనవసర గొడవలకు దారి తీశారు. ఇక యావర్ వంతు వచ్చినప్పుడు సందీప్ మాస్టర్ తో బాగా గొడవకు దిగాడు. ఆయన ఆవేశంలో సందీప్ మాస్టర్ బొంగులే అన్న పదం వాడటంతో.. అది కాస్త పెద్ద ఇష్యూ అయ్యింది. ఈ విషయాన్ని కవర్ చేయడానికి చూశాడు సందీప్. కానీ అప్పటికే అందరూ వినడంతో అది కాస్త తప్పు అని అందరూ భావించారు. ఇక సందీప్ వంతు వచ్చినప్పుడు ప్రశాంత్, వచ్చి భోలే, శోభా శెట్టిలను నామినేట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన యావర్.. శివాజీ, భోలేలను నామినేట్ చేశారు.

ఇక భోలే వంతు వచ్చినప్పుడు శోభా శెట్టి, గౌతమ్ లను చేశాడు. లా నామినేషన్స్ మొత్తం వాడి వేడిగానే సాగిపోయింది. యావర్ వచ్చి సందీప్ ను నామినేట్ చేశాడు. నువ్వు సేఫ్ ప్లేయర్ అని అనడంతో దానికి సందీప్ అడ్డు చెప్పాడు. ఇక మధ్యలో వచ్చిన భోలే షావలి, శోభాశెట్టిక మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.

ఇద్దరూ చాలా సేపు వాదులాడుకున్నారు. ఆ తర్వాత టేస్టీ తేజను అంబటి నామినేట్ చేస్తూ కొన్ని కారణాలుచెప్పాడు. అలా కూడా గొడవలు జరిగాయి. ఇక నామినేషన్స్ పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మీరుమాట్లాడేటైమ్ లో.. కాస్త ఆలోచించి మాట్టాడాలి.. తప్పుడు పదాలు వాడొద్దు అంటూ తెలిపాడు బిగ్ బాస్.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us