Bigg boss: బిగ్ బాస్ సీజ‌న్ 5 ఫినాలే ఎప్పుడో తెలుసా.. చీఫ్ గెస్ట్ ఎవ‌రు?

Bigg boss: ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట హిందీలో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న ఈ కాంట్రవర్సీ షో తెలుగులోను భారీ స్థాయిలో అయితే క్రేజ్ అందుకుంది. తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో ప్ర‌స్తుతం ఐదో సీజ‌న్ జ‌రుపుకుంటుంది.

bigg boss final on dec 19
bigg boss final on dec 19

బిగ్ బాస్ సీజన్ వన్ మొదలైనప్పుడు అసలు రేటింగ్స్ వస్తాయా లేదా అనుమానాలు చాలానే వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ తో మంచి ట్రాక్ క్రియేట్ చేయడంతో ఆ తరువాత జనాల్లోకి ఈజిగానే వెళ్లింది. ఆ తరువాత నాని, నాగార్జున కూడా అదే తరహాలో కొనసాగించారు.తాజా సీజ‌న్ని కూడా నాగార్జున చ‌క్క‌గా న‌డిపిస్తున్నారు.

అయితే బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. 9తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు. ఆరోగ్య కారణాలతో 10వ కంటెస్టెంట్ జెస్సీ హౌస్ ని వీడడం జరిగింది. ఇక మిగిలిన 9మంది కంటెస్టెంట్స్ నుండి ఐదుగురు ఫైనల్ కి నలుగురు ఎలిమినేటై హౌస్ నుండి బయటికి రానున్నారు. ఫైనల్ సమీపిస్తున్న నేపథ్యంలో హౌస్ లో టాస్క్ లు కూడా రసవత్తరంగా మారాయి.

తాజా స‌మాచారం ప్రకారం బిగ్ బాప్ సీజ‌న్ 5 ఫినాలే డిసెంబ‌ర్ 19న జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ కార్య‌క్ర‌మానికి స్టార్ హీరోని గెస్ట్‌గా తీసుకురానున్నార‌ని స‌మాచారం. ఇక టాప్ 5లో శ్రీరామ్ చంద్ర‌, సిరి, ష‌ణ్ముఖ్, స‌న్నీ, మాన‌స్ ఉంటార‌ని తెలుస్తుంది. ఈ సారి ట్రోఫీ ఎవ‌రు అందుకుంటార‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

bigg boss final on dec 192
bigg boss final on dec 192

ఇక ఈ వారాం కెప్టెన్ రవి మినహాయించి… ఎనిమిది మంది నామినేట్ కావడం జరిగింది. వీరిలో కాజల్, లేదా యాని మాస్టర్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కలదని తెలుస్తుంది. నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో వీరిద్దరికే తక్కువ ఓట్లు వచ్చాయని, అంటున్నారు.