Sohel: అనీల్ రావిపూడితో సోహైల్ డిస్క‌ష‌న్.. ఏంటి క‌థ‌!

Samsthi 2210 - July 1, 2021 / 04:57 PM IST

Sohel: అనీల్ రావిపూడితో సోహైల్ డిస్క‌ష‌న్.. ఏంటి క‌థ‌!

Sohel: బిగ్ బాస్ 4 కార్య‌క్ర‌మంతో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సోహైల్. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు అయిన సోహైల్ అంటే చాలా మందికి తెలియ‌దు. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టాడో అప్ప‌టి నుండి సోహైల్ క‌థ మారింది. ఆయ‌న‌కు సినిమా ఆఫర్స్ కూడా క్యూ క‌డుతున్నాయి. ఈయన కెరీర్‌లో చాలా కన్నీళ్లు, కష్టాలున్నాయి.

Sohel

సోహైల్ తండ్రి సింగరేణి కార్మికుడు. ఈయన పుట్టి పెరిగింది గోదావరిఖనిలోనే. అక్కడే చదువు పూర్తైన తర్వాత సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చాడు సోహైల్. 2008లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన కొత్త బంగారు లోకంలో నటించాడు సోహైల్. ఆ తర్వాత శర్వానంద్ నిర్మించిన డి ఫర్ దోపిడి.. ఇంద్రగంటి తెరకెక్కించిన అంతకుముందు ఆ తర్వాత, జనతా గ్యారేజ్ సినిమాల్లో నటించాడు.

యురేక సినిమాలో హీరోగా కూడా నటించాడు సోహైల్. అయితే అవన్నీ కోరుకున్న గుర్తింపు తీసుకురాలేదు. ఇలాంటి సమయంలో కృష్ణవేణి అనే సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు సోహైల్. కెరీర్‌లో ఎన్ని చేసినా కూడా మేజర్ బ్రేక్ మాత్రం బిగ్ బాస్ అంటున్నాడు సోహైల్. బిగ్ బాస్‌తో వ‌చ్చిన క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటున్న సోహైల్ వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ అందుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి లాంటి లెజెండ్స్ ఇంటికి వెళ్లి కొంత స‌మ‌యం గ‌డిపే స‌మ‌యం ద‌క్కించుకున్నాడు.

Sohel

తాజాగా వ‌రుస హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడిని క‌లిసాడు సోహైల్. వీరిద్ద‌రిని డిస్క‌ష‌న్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సోహైల్‌తో అనీల్ ఏదైన సినిమా ప్లాన్ చేశాడా అంద‌రు అనుకుంటున్న స‌మ‌యంలో వివ‌ర‌ణ ఇచ్చాడు సోహైల్. జీరో యాటిట్యూడ్, ఎంతో మంచి మనిషి, ఎంతో ఇంటెలిజెంట్ అయిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని కలిసే చాన్స్ వచ్చింది .

ఇది కేవ‌లం ఫ్రెండ్లీ మీటింగ్ అంటున్నాడు సోహైల్. బిగ్ బాస్ రోజుల‌ని గుర్తు చేసుకొని న‌వ్వుకున్నాం. జ‌ర్నీ గురించి అనుభ‌వాల గురించి ముచ్చ‌టించాం. నా స‌క్సెస్ జ‌ర్నీకి సంబంధించి ఆయ‌న ఎన్నో స‌ల‌హాలు, సూచ‌న‌లు చేశారు. అవి ఎప్ప‌టికీ గుర్తుంటాయి. విలువైన స‌మ‌యాన్ని నాకు కేటాయించినందుకు థ్యాంక్స్. మ‌ళ్లీ మిమ్మ‌ల్ని క‌లిసేందుకు ఎదురు చూస్తుంటాను స‌ర్ అంటూ సోహైల్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us