Sarayu: ఆధారాలు బ‌య‌ట‌పెట్టి మాట్లాడ‌తా.. స‌ర‌యు సంచ‌ల‌న కామెంట్స్

Sarayu: ‘7 ఆర్ట్స్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంత ఫేమ్ తెచ్చుకొని బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిన హాట్ సుంద‌రి స‌ర‌యు. ఈ అమ్మ‌డు అంత‌క‌ముందు చేసిన వీడియోలు అన్నీ చాలా హాట్‌గా ఉండేవి. ప‌చ్చి బూతులు మాట్లాడుతూ, హాట్ హాట్‌గా ఎక్స్‌పోజింగ్ చేస్తూ ర‌చ్చ చేస్తూ ఉండేది.

Bigg Boss Fame Sarayu Sensational Comments
Bigg Boss Fame Sarayu Sensational Comments

బిగ్ బాస్ షోలోను ఈ అమ్మ‌డు అలానే చేస్తుంద‌ని అంతా అనుకున్నారు. నాగార్జున కూడా స‌ర‌యు ఏంటి నీ భాష మాట్లాడ‌ట్లేద‌ని అడిగాడు. దానికి ఆమె మీరు తిడ‌తారేమోన‌ని స‌ర్ అంటూ వినయంగా చెప్పింది. కాని దానికి నాగ్ నీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడు అని చెప్పాడు.అయితే తిట్ల పురాణం మొద‌లు పెడ‌దాం అనే స‌రికి ఈ అమ్మ‌డు బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

ఎలిమినేట్ అయ్యి వస్తూ వస్తూ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసింది సరయు. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్, సిరిలు కలసి ఆడుతున్న కంబైండ్ గేమ్ గుట్టురట్టు చేసింది.షణ్ముఖ్‌కి దమ్ముంటే మాగాడిలా ఆట ఆడాలని లేదంటే ఆడదానిలా గాజులేసుకుని కూర్చోవాలని చెప్పింది. అలాగే సిరి హనుమంత్ మగాళ్లను అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

స‌ర‌యు మాట‌లు ఆమె ఫ్యాన్స్‌ని ఫుల్‌గా హ‌ర్ట్ చేశాయి. దీంతో ఆమెను భీబ‌త్సంగా ట్రోల్ చేశారు. దీనిపై ఆమె రియాక్ట్ అవుతూ షణ్ముఖ్ ఫ్యాన్స్‌కి సవాల్ విసిరింది. హౌస్‌లో ఏం జరిగిందో తెలియకుండా టార్గెట్ చేస్తున్నారని.. ఆ గొడవలను టెలికాస్ట్ చేయలేదని.. అయితే తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయంటూ బిగ్ బాస్ బండారాన్ని మొత్తం బయటపెట్టింది.

‘నాకు సపోర్ట్ చేసిన నా వాళ్లందరికీ థాంక్స్.. నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత బిగ్ బాస్ షో గురించి కానీ అందులోని కంటెస్టెంట్స్ గురించి కానీ.. వీడియోలు చేయాలని అనుకోలేదు. కానీ నాకు జరిగిన ఆ రెండు ఇన్సిడెంట్స్ వల్ల ఈ వీడియో చేయడం తప్పడం లేదు. ఆ రెండు ఏంటి అంటే.. ఎవరో షణ్ముఖ్ ఫ్యాన్స్ అంట.. సోషల్ మీడియాలో నాపై బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది ఫోన్లు కూడా చేసి తిడుతున్నారు. దానిపై తరువాత మాట్లాడతా.

రెండో విష‌యం సింగ‌రేణి కాల‌నీలో ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి చంప‌డం. మా ఇళ్లు సరూర్ నగర్‌లో.. సింగరేణి కాలనీ అక్కడకి దగ్గరే.. నేను వాళ్ల పేరెంట్స్‌కి సపోర్ట్ చేయడానికి వెళ్తున్నా.. మీకు దమ్ముంటే వచ్చి వాళ్ల పేరెంట్స్‌కి సపోర్ట్ చేయండి. ఆ తరువాత వచ్చి నన్ను.. ల*, ము* అని కామెంట్లు పెట్టండి. నన్ను ఎటాక్ చేయండి.. అప్పుడు నా సమాధానం ఇవ్వండి.

లోప‌ల ఎన్ని ఇబ్బందులు ప‌డ్డానో మీకు తెలియ‌దు. నాకు జ‌రిగిన ఇన్సిడెంట్స్ టీవీలో వ‌చ్చి ఉంటాయ‌ని అలా మాట్లాడాను. నా తరుపున ఆలోచిస్తారనే అనుకున్నా.. కానీ బయటకు వచ్చి నా ఎపిసోడ్స్ చూస్తే లోపల జరిగింది ఏదీ టెలికాస్ట్ కాలేదు. అయినా పర్లేదు.. నా దగ్గర ఉన్న ఆధారాలతో అన్నీ బయటపెడతా.. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్‌లో సెప్టెంబర్ 15 ఉదయం 11 గంటలకు అన్ని ఆధారాల్ని బయటపెడతా’ అంటూ వీడియో విడుదల చేసింది సరయు. కాక‌పోతే అవేమి విడుద‌ల చేయేలేదు. అందుకు కార‌ణాలేంట‌నేది తెలియ‌దు.