Divi: పెళ్లిపై మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ..!

Divi: బిగ్ బాస్.. ఈ ఒక్క వేదిక చాలు ఎలాంటి వారైనా ఫేమ్ సంపాదించుకోవడానికి. అందులోనూ తెలుగులో నిర్వహించిన సీజన్స్ లో నాల్గవ సీజన్ లో కంటెస్టెంట్స్ కి విపరీతంగా క్రేజ్ వచ్చింది. అటు అభిమానుల్లో ఇటు కెరీర్ పరంగా విజయం సాధించారు. అలాంటి వారిలో సోహైల్, అఖిల్, మోనాల్, అరియానాలు అద్దిరిపోయే సక్సెస్ ని అందుకున్నారు. వీరిలో హీరోయిన్ దివి కూడా ఉన్నారు. తెలుగులో అప్పుడప్పుడు కనిపించిన దివికి బిగ్ బాస్ మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

Bigg Boss Divi

తెలుగు అమ్మాయి కావడం, ఆమె హైట్, స్మైల్ తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. కుర్రకారు కూడా సోషల్ మీడియాలో దివికి అభిమానుల్ని అయ్యేలా చేసుకుంది. తన అలవాట్లు, పద్ధతులతోనే అభిమానుల్ని ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ కు చేరుకోకపోయినా.. ప్రేక్షకుల్లో మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ షో తర్వాత దివికి సినిమా అవకాశాలతో పాటు డిజిటల్ మీడియా ఆఫర్లు వరిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె క్యాబ్ స్టోరీస్ అనే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఫిమేల్ లీడ్ రోల్ క్యారెక్టర్ ను పోషిస్తున్నారు.

Bigg Boss Divi

అయితే ఇటీవల కాలంలో ఓ సందర్భంలో పెళ్ళిపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేశారు. సినిమాల్లో తన కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందని.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంటుందని.. అయితే తను పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి మంచిగా తనని ప్రేమించే వ్యక్తి కావాలని.. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా గౌరవించేవాడు ఉండాలని చెప్పింది. అలాగే తన హైట్ కు తగ్గట్లుగా మంచి హైట్ ఉండే పర్సన్ అయితే పెళ్ళి చేసుకుంటానని తెలిపింది. ఇదిలా ఉంటే దివి తన పాస్ట్ లో ఒకర్ని ఇష్టపడ్డారట. అయితే ఆ వ్యక్తి దివి భవిష్యత్ ని, సినిమాపై ఉండే కలల్ని వదిలేసి సాధారణ జీవితాన్ని గడపాలని అనడంతో.. కెరీర్ వదిలేయడం ఇష్టం లేని దివి, ఆ వ్యక్తికి బ్రేకప్ చెప్పారని ఓ ఇంటర్వ్యూలో దివి తల్లి చెప్పారు.