Ashu Reddy: ఇద్ద‌రితో అషూ ప్రేమ క‌హానీ.. క్లారిటీ ఇచ్చిన జూనియ‌ర్ స‌మంత‌

Ashu Reddy: సోష‌ల్ మీడియా ద్వారా బాగా పాపుల‌రాటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ అషూ రెడ్డి. ఈ అమ్మ‌డికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ‌. పలు షోస్‌తో పాటు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉండే అషూ రెడ్డి ప్ర‌స్తుతం ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ నడుపుతున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో నిజ‌మెంటో తెలియ‌క అంతా అయోమ‌యంలో ఉన్నారు.

Ashu Reddy

అషూ రెడ్డి బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇటు రాహుల్‌తో అటు హ‌రితో ఈ అమ్మ‌డు ప్రేమాయ‌ణం న‌డిపిస్తుందా అనే అనుమానాలు ఈ మ‌ధ్య ఎక్కువ‌య్యాయి. రాహుల్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు పున‌ర్న‌వితో చాలా చ‌నువుగా ఉన్నాడు. బ‌య‌ట‌కు వ‌చ్చాక మాత్రం అషూతో చెట్టా ప‌ట్టాలేసుకొని తిర‌గ‌డం, ఇద్ద‌రు చ‌నువ‌గా ఫొటోలు దిగడం వంటివి చేశాడు.

రాహుల్ సోష‌ల్ మీడియాలో అషూ గురించి చేసే కొన్ని పోస్ట్‌లు కూడా అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగించాయి. త్వ‌ర‌లోనే వీరిద్దరు గుడ్ న్యూస్ చెబుతార‌ని అంతా భావించారు. అయితే ఇటీవలె ఓ షోలో పాల్గొన్న అషూ ..ఎక్స్‌ప్రెస్‌ హరి అనే కమెడియన్‌తో క్లోజ్‌గా ఉండటంతో ఇది ట్రయాంగిల్‌ లవ్‌ అవుతుందేమోన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. హ‌రి త‌న ఛాతిపై అషూ పేరుతో టాటూ వేయించుకోవడంతో అషూ- హ‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నే అనుమ‌నాలు అంద‌రి మదిలో మెదులుతున్నాయి.

Ashu Reddy

తాజాగా అషూ ఇన్‌స్టా లైవ్‌లోకి రాగా ప‌లు విష‌యాల గురించి చెప్పుకొచ్చింది. హ‌రి- రాహుల్‌లో ఒక ఆప్ష‌న్ మాత్ర‌మే ఎంపిక చేసుకోవాల‌ని నెటిజ‌న్స్.. అషూని కోర‌గా, అందుకు ఆమె ‘కుడి కన్ను కావాలా, ఎడమ కన్ను కావాలా అని అడిగితే ఏం చెప్పాలంటూ’ అషూ ఫన్నీగా బదులిచ్చింది . అంతేకాకుండా ఈ ఇద్దరిలో ఒకరిని తాను ఇష్టపడుతుంటే, మరొకరు తనని ఇష్టపడుతున్నారంటూ చిన్న హింట్‌ కూడా ఇచ్చేసింది.

అషూ మాట‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే ఇదే దో ట్ర‌యాంగిల్ కోణంలో న‌డుస్తుంద‌నే సందేహం నెల‌కొంది. ఇక ఎక్స్‌ప్రెస్‌ హరి .. అషూ పేరుని టాటూగా వేసుకోవ‌డం గురించి స్పందిస్తూ..అది ఒకషో కోసమని, షోలో చాలా జరుగుతుంటాయని చెప్పింది. దీంతో ఆ టాటూ ఫేక్‌ అని తేలిపోయింది.