Hari Teja: అచ్చం త‌ల్లి పోలిక‌ల‌తోనే.. కూతురి ఫొటోని తొలి సారి షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: బుల్లితెర యాంక‌ర్‌గా, న‌టిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ముద్దుగుమ్మ హ‌రితేజ‌. బిగ్‌బాస్‌ 1లోకి వెళ్లి తనదైన నటనతో బుల్లితెర ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది. ముఖ్యంగా హౌజ్ లో ఉన్న‌ప్పుడు హ‌రితేజ చెప్పిన బుర్ర‌క‌థ ఆమెకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. అడ‌పాద‌డపా సినిమాలోను నటిస్తూ ప్రేక్ష‌కులని అల‌రించింది. రాజా ది గ్రేట్‌, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో హరితేజ నటించి అల‌రించింది.

Hari Teja

2015లో దీపక్‌ రావును పెళ్లాడిన హరితేజ ఈ ఏడాది ఏప్రిల్ 5న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే హరితేజ గర్భంతో ఉన్న‌ప్పుడు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ బేబీ బంప్ ఫోటో షూట్ , పబ్‌లో పాటలు పాడటం, డ్యాన్సులు వేయడం, ఇక శ్రీమంతం వేడుకల్లో చేసిన ర‌చ్చ‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. అన్నింటి కంటే ముఖ్యంగా డెలీవరి సమయంలో తాను పడిన కష్టాల గురించి హరితేజ చెప్పిన విషయాలు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాయి.

డెలివరీ సమయంలోనే హ‌రితేజ‌కు కరోనా పాజిటివ్ అని రావడం, కొన్ని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించుకోకపోవడం, పుట్టబోయే బిడ్డకు కూడా ఏదైనా ప్రమాదం ఉంటుందా? అని భ‌యంలో బ‌త‌క‌డం, ఇక ఎవ‌రు సాయం చేయ‌లేని ప‌రిస్థితిలో ఉండ‌గా, త‌న భ‌ర్తనే అన్ని సేవ‌లు చేశారంటూ వ్య‌థ‌ను వివరించింది. అయితే ప్ర‌స్తుతం వారి జీవితం ఆనందంగా ఉంది. కూతురికి సంబంధించిన వివ‌రాలు ఒక్కొక్క‌టి తెలియ‌జేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తున్నారు.

ఇటీవ‌ల తన కూతురికి భూమిక దీపకరావు అని పేరు పెట్టామ‌ని చెప్పిన హ‌ర‌తేజ , భూమి అంటే సహనంతో ఉంటుందని అనుకుంటున్నారు.. కానీ వాళ్లకేం తెలుసు సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే అని తన బిడ్డ చెబుతున్నట్టుగా త‌న పోస్ట్‌లో పేర్కొంది.

తాజాగా హరితేజ తన చిన్నారి ఫోటోను రివీల్‌ చేసేసింది. మీట్ మిస్‌ భూమి దీపక్‌ రావ్‌ అంటూ కూతురి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు బుల్లితెర ప్రముఖులు సహా నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అచ్చం త‌ల్లి మాదిరిగానే అందంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.