Bigg Boss 7 Telugu : రతిక, పల్లవి ప్రశాంత్ లను వాడేస్తున్న శివాజీ.. సీరియల్ బ్యాచ్ కు ఇలా చెక్ పెడుతున్నాడా..?

NQ Staff - November 14, 2023 / 01:08 PM IST

Bigg Boss 7 Telugu : రతిక, పల్లవి ప్రశాంత్ లను వాడేస్తున్న శివాజీ.. సీరియల్ బ్యాచ్ కు ఇలా చెక్ పెడుతున్నాడా..?

Bigg Boss 7 Telugu  :

ఇప్పుడు బిగ్ బాస్-7 జోరు బాగానే సాగుతోంది. అయితే ఈ సారి టైటిల్ విన్నర్ ఎవరు అంటే అందరూ టక్కున చెప్తున్న పేరు శివాజీ. ఇదే ఇప్పుడు అందరి మైండ్ లో ముద్ర పడిపోయింది. టైటిల్ ఫేవరెట్ గా ఎంట్రీ ఇచ్చిన శివాజీ.. ఒక్క అడుగును తనకు అనుకూలంగా వేసుకుంటున్నాడు. మొదట్లో అగ్రెసిగ్ గా ఆడాడు శివాజీ. దాంతో తనకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వెంటనే దాన్ని గమనించిన శివాజీ కూల్ గా గేమ్ ఆడటం మొదలు పెట్టాడు. అంతే కాకుండా హౌస్ లో అందరి చేతుల్లో టార్గెట్ అవుతున్న వారికి అండగా నిలిస్తే తనకు ప్లస్ అవుతుందని గ్రహించాడు.

అందుకే సామాన్య రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ను, భాష రాక ఇబ్బందులు పడుతున్న ప్రిన్స్ యావరకు అండగా ఉంటూ వస్తున్నాడు. శివాజీ సలహాలతోనే ప్రశాంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యాడనే భావన ప్రేక్షకుల్లోకి వెళ్లింది. ప్రిన్స్ యావర్ ను సేవ్ చేస్తోంది కూడా శివాజీ అని అందరి మైండ్ లో పడింది. దాంతో ఈ ఇద్దరి విషయంలో మార్కులు కొట్టేశాడు శివాజీ. వీరిద్దరితో సీరియల్ బ్యాచ్ కు చెక్కే పెట్టేస్తున్నాడు. ఇలా ఒక్కో మెట్టు తనకు అనుకూలంగా మార్చుకుంటూ అందరి కంటే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ విషయాన్ని రీ ఎంట్రీ తర్వాత రతిక కూడా గుర్తు పట్టింది.

అందుకే సీరియల్ బ్యాచ్ లో చేరకుండా.. నేరుగా శివాజీ వద్దకు వెళ్లింది. శివాజీ బ్యాచ్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసి చివరకు సక్సెస్ అయింది. ఇప్పుడు రతిక ఆట తీరులో శివాజీ సలహాలు ఇస్తున్నాడు. అంతే కాకుండా నామినేషన్స్ వేసేటప్పుడు సూటిగా సుత్తి లేకుండా కారణాలు చెప్పాలని దాని వల్లే నువ్వు హైలెట్ అవుతావని శివాజీ చెప్పాడు. దాంతో సోమవారం నామినేషన్స్ లో రెచ్చిపోయి మరీ శోభాశెట్టి, ప్రియాంకలను నామినేట్ చేసింది. అయితే దీని వెనకాల శివాజీ మాస్టర్ ప్లాన్ ను ఆమె మర్చిపోయింది. రతిక ద్వారా ప్రియాంక, శోభాశెట్టిలకు చెక్ పెట్టిస్తున్నాడు శివాజీ.

అటు పల్లవి ప్రశాంత్ తో అమర్ దీప్, అర్జున్ లకు చెక్ పెట్టేస్తున్నాడు. ఇలా తన వర్గంతో సీరియల్ బ్యాచ్ కు చెక్ పెట్టించి తనకు పోటీ లేకుండా చూసుకుంటున్నాడు. పల్లవి ప్రశాంత్ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా సరే శివాజీ తర్వాతనే అనే టాక్ నడుస్తోంది. కాబట్టి ప్రేక్షకులు కూడా శివాజీని తెగ పొగిడేస్తున్నారు.

ఇలా రతిక రోజ్, పల్లవి ప్రశాంత్ లను వాడుకుంటూ తాను సేఫ్ జోన్ లో ఉంటున్నాడు. కానీ ఆ విషయాలు మాత్రం రతిక, ప్రశాంత్ లకు అర్థం కావట్లేదు. తమకు శివాజీ అండగా ఉంటున్నాడని వారు భావిస్తున్నారు. ఏదేమైనా శివాజీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఆయనకు అనుకూలంగానే మారుతున్నాయి. మరి టైటిల్ గెలుస్తాడా లేదా అన్నది చూడాలి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us