Bigg Boss 6: బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్లు వీళ్లేనా.? ఫిక్సయిపోయినట్లేనా.?
NQ Staff - May 25, 2022 / 04:35 PM IST

Bigg Boss 6: బిగ్ బాస్ రియాల్టీ షో విషయంలో అంతా సీక్రెట్‌గా జరుగుతుందనీ, జెన్యూన్‌గా వుంటుందని నిర్వాహకులు చెప్పుకోవడం తప్ప, అందులో అంత జెన్యూనిటీ వుండదు, సీక్రెసీ అసలే వుండదు. ఓటింగ్ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ ముందస్తు అంచనాలకు తగ్గట్టే అన్నీ జరుగుతుంటాయి. కంటెస్టెంట్ల ఎంపిక విషయంలోనూ అంతే.

Bigg Boss 6 Contestants Names Going Viral
బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఇటీవల ముగిసింది. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్ మొదలు కాబోతోంది. జులై చివరి వారంలో లేదా ఆగస్ట్ మొదటి వారంలో కొత్త సీజన్ మొదలవుతుందనే ప్రచారం తెరపైకొచ్చింది. అంతే కాదు, 12 మంది కంటెస్టెంట్ల పేర్లు కూడా లీక్ అయిపోయాయి.
న్యూస్ ఛానల్ నుంచి ఈసారి న్యూస్ రీడర్ ప్రత్యూష పేరు ప్రచారంలో వుంది. గతంలో టీవీ 9 నుంచే జాఫర్, దేవి నాగవల్లి, దీప్తి నల్లమోతు తదితరులు బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రత్యూష కూడా టీవీ9 న్యూస్ రీడర్ కావడం గమనార్హం.
సీనియర్ మోస్ట్ బుల్లితెర యాంకర్ ఉదయభాను పేరు తాజాగా బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ కోసం ప్రచారంలోకి వచ్చింది. గతంలోనూ ఈమె పేరు వినిపించినా, అప్పట్లో ఆమె ఈ షోలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపలేదట. ఈసారి బిగ్ అమౌంట్ ఆమెకు నిర్వాహకులు ఆఫర్ చేశారని తెలుస్తోంది.
ఆర్జే చైతు, ఆర్జే హేమంత్‌లలో ఒకరు కొత్త సీజన్‌లో కంటెస్టెంట్లుగా వుండబోతున్నారట. హేమంత్ పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. తెలుగునాట బోల్డంత ఫాలోయింగ్ వున్న సినీ నటుడు, ఆర్జే హేమంత్. బిగ్ బాస్ ఓటీటీలో సందడి చేసిన అజయ్ కూడా ఆరో సీజన్‌లో వుండొచ్చట. యాంకర్ శివ కూడా రిపీట్ అవుతాడని ప్రచారం జరుగుతోంది. అనిల్ రాథోడ్, మిత్రా శర్మ తదితరులూ రిపీట్ అవ్వొచ్చునట.
బిగ్ బాస్ నాన్‌స్టాప్ నుంచి మొత్తం నలుగురు లేదా ఐదుగురు బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్లుగా వుంటారని తెలుస్తోంది. మరో న్యూస్ రీడర్ రోజా, మామా సింగ్ అలియాస్ కృష్ణ చైతన్య, అమర్ దీప్ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. మానస్ నాగుల పల్లి, కౌశిక్‌లలో ఎవరో ఒకరు కొత్త సీజన్ కంటెస్టెంట్ అవ్వొచ్చునట. యూ ట్యూబ్ వీడియోలతో సందడి చేసే నిఖిల్, గెటప్ శీను పేర్లు కూడా ప్రచారంలో వున్నాయి.