షాకింగ్‌: రెండో వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటా?

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంది. ఇప్ప‌టికే హౌజ్ నుండి స‌ర‌యు ఎలిమినేట్ కాగా, ఈ ఆదివారం మ‌రో కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారు.వారిలో ఎవరు ఆనేది ఆసక్తిక‌రంగా మారింది. ఈ వారం వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన వారిలో అని మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, ఉమ, లోబో, ఆర్జే కాజల్ ఉన్నారు.

Bigg Boss

 

బిగ్ బాస్ నుంచి రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారని కొన్ని స‌ర్వేలు నిర్వ‌హించ‌గా, అందులో .. లోబో 4.28 శాతం మంది, ప్రియకు 5.88 శాతం, ఆర్జే కాజల్‌కు 7.49 శాతం మంది, ప్రియాంక సింగ్‌కు 6.42 శాతం మంది, అని మాస్టర్‌కు 6.95 మంది, నటరాజ్ మాస్టర్‌కు 16.58 మంది, కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవికి 52.41 శాతం మంది ఓటు వేశారు.

అత్యధిక మంది ఓటు వేసిన ఉమాదేవికి ఎలిమినేషన్ ముప్పు ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ వారం ఉమాదేవి ఎలిమినేష‌న్ ప‌క్కా అని కూడా స‌మాచారం అందుతుంది. కార్తీక దీపం సీరియ‌ల్‌లో న‌టించిన ఉమా దేవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే కాని ఈవిడ త‌న అత్యుత్సాహం వ‌ల్ల‌నే నెగెటివ్ టాక్ తెచ్చుకుంద‌ని అందువ‌ల్ల‌నే ఎలిమినేట్ కానుంద‌ని తెలుస్తుంది.

ఉమాదేవి కాలేదు అంటే అనీ మాస్ట‌ర్ లేదా న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌ల‌లో ఒక‌రు ఎలిమినేట్ కానున్నార‌ని ఇన్‌సైడ్ టాక్. కాజ‌ల్‌, ప్రియాంక‌, ప్రియా,లోబోల‌కు ఫాలోయింగ్ ఉంది కాబ‌ట్టి వారు త‌ప్ప‌క సేఫ్ అవుతారనే అభిప్రాయం అభిమానుల‌లో ఉంది.