Bigg Boss 5 Telugu: ఎనిమిదో వారం నామినేష‌న్‌లో ఎవ‌రెవ‌రు ఉన్నారో తెలుసా?

Bigg Boss 5 Telugu ఊహించని కంటెంట్‌తో ప్ర‌సారం అవుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మానికి ప్రేక్షకుల నుండి ఊహించని రీతిలో స్పందనను అందించడంతో సూపర్ డూపర్ హిట్ షోగా మారింది బిగ్ బాస్ . అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టుతో నడిచే దీనికి అన్ని భాషల కంటే మన దగ్గరే మంచి రెస్పాన్స్ అందుతోంది.

ఇప్పటి వరకూ వచ్చిన నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

ఈ సారి 19 మంది కంటెస్టెంట్లను పంపించారు. అలాగే, ఆరంభం నుంచే సరికొత్త టాస్కులతో షో ఆసక్తికరంగా సాగుతోంది. దీనికితోడు గొడవలు, కొట్లాటలు వంటి వాటితో మరింత మజాను పంచుతూ సాగుతోంది. దీంతో భారీ రేటింగ్‌ను కూడా సంపాదించుకుంటోంది. ఏడోవారం హౌజ్ నుండి ప్రియ ఎలిమినేట్ కాగా, నేడు నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది.

గ‌త మూడు వారాలుగా నామినేష‌న్‌లో ఎక్కువ మంది స‌భ్యులు ఉంటుండ‌గా, ఈ వారం ఆరుగురు స‌భ్యులు మాత్ర‌మే ఉన్న‌ట్టు స‌మాచారం. నామినేష‌న్‌లో లోబో, ర‌వి, ష‌ణ్ముఖ్‌, మాన‌స్‌, శ్రీరామ్, సిరి ఉన్నారు.ఈ ఆరుగురిలో అంద‌రి క‌న్నా వీక్ కంటెస్టెంట్స్ లోబో. ఆ త‌ర్వాత సిరి అని చెప్ప‌వ‌చ్చు.

మిగ‌తా వారంద‌రు త‌మ‌దైన శైలిలో గేమ్ ఆడుతుండ‌గా, సిరి,లోబో మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్న‌ట్టే. మ‌హిళా కంటెస్టెంట్‌నే పంపాలి అని బిగ్ బాస్ అనుకుంటే సిరి ఎలిమినేట్ అవుతుంది. లేదంటే లోబో ఎలిమినేట్ కావ‌డం ఖాయం.