Bigg Boss Kajal: కూతురిని చూసి క‌న్నీరుమున్నీరుగా విల‌పించిన కాజ‌ల్

Bigg Boss Kajal: బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం ఆస‌క్తిగా సాగుతుంది. ఈ షో చివ‌రి ద‌శ‌కు చేర‌డంతో హౌజ్‌మేట్స్‌కి విచిత్రమైన టాస్కులు ఇస్తూ ఫుల్ ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు బిగ్ బాస్. అలానే షో ఎండింగ్‌కు రావ‌డంతో బిగ్ బాస్ హౌజ్ మేట్స్ ఫ్యామిలీని ప్ర‌వేశ‌పెట్టాడు. దీంతో హౌస్‌లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.

kajal

ప్రతి సీజన్‌లోలాగే ఈసారి కూడా కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించాడు బిగ్‌బాస్‌. ఫ్రీజ్ లో ఉన్న స‌మయంలో హౌజ్‌మేట్స్ కుటుంబ స‌భ్యులు లోప‌లికి రావ‌డంతో వారంతా తెగ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఈసారి వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో హౌస్‌మేట్స్‌ కుటుంబ సభ్యులను మూడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచి నేరుగా ఇంట్లోకి పంపించారు.

బీబీ ఎక్స్‌ప్రెస్‌ గేమ్‌ ఆడుతున్న కంటెస్టెంట్లను కదలకుండా ఆగుమన్న సమయంలో వారి కుటుంబ సభ్యులను లోనికి పంపించి సర్‌ప్రైజ్‌ చేశాడు బిగ్‌బాస్‌. కాజల్‌ భర్త, కూతురు ఇంట్లో అడుగుపెట్టారు. వారిని చూడగానే కాజల్‌ ఎమోషనల్‌ అయింది. తల్లీకూతుళ్లు ఒకరినొకరు హత్తుకుని ఏడ్చారు.

ఇక కాజల్‌ గురించి ఆమె భర్త మాట్లాడుతూ.. ఎవరెక్కడ ఏం మాట్లాడినా మా ఆవిడ గొంతు వినిపిస్తుంటుందని చెప్పాడు. ‘మీ మమ్మీని ఎవరైనా నామినేట్‌ చేస్తే కోపమొస్తుందా?’ అని శ్రీరామ్‌ అడగ్గా అందుకు కాజల్‌ కూతురు అవునంటూ పవన్‌ కల్యాణ్‌ స్టైల్లో ఆన్సరిచ్చింది.

తర్వాత శ్రీరామ్‌ కోసం ఆమె సోదరిని పంపించినట్లు తెలుస్తోంది. షణ్ముఖ్‌ తనకోసం ఎవరిని పంపిస్తున్నారో ముందే చెప్తే తన మైండ్‌ను ప్రిపేర్‌ చేసుకుంటానని కెమెరాకు విన్నవించాడు. అయితే నెట్టింట వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి షణ్ను కోసం ఆమె తల్లి హౌస్‌లోకి వస్తున్న‌ట్టు తెలుస్తుంది.