Bigg Boss 5: తెలుగు బిగ్ బాస్ ఐదవ సీజన్ పై బ్రేకింగ్ అప్డేట్స్..

Bigg Boss 5: బిగ్ బాస్ వేదిక అంటే ప్రేక్షకుల అభిమాన హృదయాలకు ద్వారంలాంటిది. అప్పటివరకు ఎలాంటి క్రేజ్ వాళ్ళనైనా సరే ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేస్తుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనైనా సరే బిగ్ బాస్ గాసిప్స్ కి, టాస్కులకు, ఆటపాటలకు అంతు ఉండదు. బిగ్ బాస్ హౌస్ తాళం వేసి మరీ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. మొదట్లో బిగ్ బాస్ ఇంటిని చూసిన ప్రేక్షకులు ఏంటిది అనుకున్నా.. ఆ తర్వాత కాలంలో బిగ్ బాస్ ఇంటికి అతుక్కుపోయారు. వాటికి సంబంధించిన గాసిప్స్ ను పర్సనల్ గా మాట్లాడుకోవడం.. తమ ఫేవరేట్ కంటెస్టెంట్స్ కి ఓట్లు వేయడం గెలిపించడంలో ఉండే మజాని ఎంజాయ్ చేశారు.

అలా తెలుగులో సూపర్ డూపర్ హిట్ కొట్టింది బిగ్ బాస్ హౌస్. ఇప్పుడు గ్రాండ్ గా ఐదవ సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బుల్లితెర వర్గాలు గుసగుసలాడుతున్నాయి. నిజానికి ఈ ఐదో సీజన్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కాకపోతే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇప్పుడున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం బిగ్ బాస్ యూనిట్ సన్నిహిత వర్గాలు ఐదో సీజన్ పై కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సీజన్ కోసం బ్యాక్ ఎండ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

అలాగే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కోసం ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ ఫాం, జూమ్ యాప్ ల ద్వారా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కంటెస్టెంట్ ల లిస్ట్ ని రెడీ చేస్తున్నారు. ఈ సీజన్ జులై నెలలో బుల్లితెరపైకి రానుంది. అలాగే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారనే విషయం తెలుస్తుంది. గత రెండు సీజన్ లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున నే ఐదవ సీజన్ కు హోస్ట్ అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా బిగ్ బాస్ అనగానే తెలుగు ప్రేక్షకుల్లో ఓ నూతన ఉత్సాహం కలుగుతుంది. ఇక బిగ్ బాస్ 5 సీజన్ పై మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడాల్సిందే. దీనిపై బిగ్ బాస్ టీమ్ నుండి ఎలాంటి అఫిషియల్ సమాచారం రాలేదు.