BIGG BOSS: బిగ్ బాస్ 5 ఈ సారి కూడా లేట్‌గా మొద‌లు కానుందా.. హోస్ట్ ఎవ‌రు?

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. తెలుగులో నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ కార్య‌క్ర‌మం ఇప్పుడు ఐదో సీజ‌న్‌కు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది కరోనా వ‌ల‌న లేట్‌గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ షో ఈ ఏడాది కూడా కొంత ఆల‌స్యంగా ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. ఏడాది మొద‌ట్లో క‌రోనా కాస్త శాంతించిన‌ట్టు క‌నిపించ‌డంతో జూన్‌లో మొద‌లు అవుతుంద‌ని అనుకున్నారు అంతా. కాని ఇప్పుడు క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్‌లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ క‌నిపిస్తుంది.

 

ఇక హోస్ట్ విష‌యానికి వ‌స్తే నాగార్జున ప‌లు క‌మిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న వేరే హీరోని హోస్ట్‌గా తీసుకొస్తార‌ని అన్నారు. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం సీజ‌న్ 5ని కూడా నాగార్జున‌నే హోస్ట్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. ఇక కంటెస్టెంట్స్ విష‌యానికి వ‌స్తే ప‌లువురిని ఇంట‌ర్వ్యూ చేసి ఆ త‌ర్వాత వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి హౌజ్‌లో ప్ర‌వేశింప‌జేస్తార‌ట‌. కాగా, గ‌త సీజ‌న్‌లో విన్న‌ర్‌గా అభిజీత్ నిల‌వ‌గా, అఖిల్ రన్న‌ర‌ప్‌గా నిలిచాడు.

Advertisement