Bigg Boss 5: బిగ్ బాస్ హౌజ్ నుండి ఈ వారం ఆమె ఔట్‌..!

Bigg Boss 5: బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. 19 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభ‌మైన ఈ షోలో ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎలిమినేట్ కాగా, ప్ర‌స్తుతం హౌజ్‌లో 17 మంది ఉన్నారు. ఈ ఆదివారం మ‌రొక‌రు ఎలిమినేట్ కానున్నారు. అయితే ఈ సారి నామినేష‌న్స్‌లో కంటెస్టెంట్స్ మ‌ధ్య చాలా ర‌స‌వ‌త్త‌ర పోటీ సాగుతుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ల‌హ‌రి ఎలిమినేట్ కానుంద‌ని తెలుస్తుంది.

ఈ అమ్మ‌డు కాస్త అతిగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని భావించిన ల‌హ‌రికి త‌క్కువ ఓట్స్ చేశారు. ప్రియ, యాంకర్‌ రవి వల్ల లహరి బ్యాడ్‌ అయింది. యాంకర్‌ రవి ఆడిన డబుల్‌ గేమ్‌ వల్ల అటు ప్రియ, ఇటు లహరి ఇద్దరూ సఫర్‌ అయ్యారు. ఎలాగంటే.. యాంకర్‌ రవి.. ప్రియతో నామినేషన్స్‌ కంటే ముందు లహరి గురించి మాట్లాడాడు. ‘ఆమె యాంకరింగ్‌ కోసం ట్రై చేస్తుంది. కానీ ‘సింగిల్‌ మెన్‌'(పెళ్లి కాని వాళ్లు)ను వదిలేసి నా వెంటే పడుతోంది. ఆమెకు ఎలా చెప్పాలో తెలియడం లేదు’ అని వాపోయాడు.

ర‌వి చెప్పిన మాట‌ల‌కు ల‌హ‌రిపై ప్రియ‌కు త‌ప్పుడు అభిప్రాయం ఏర్ప‌డింది. ఈ క్రమంలో రవి, లహరి రాత్రిపూట వాష్‌రూమ్‌ దగ్గర హగ్‌ చేసుకోవడాన్ని చూసింది. నామినేషన్స్‌లో ఈ హగ్గు విషయాన్ని ప్రస్తావిస్తూ ‘నువ్వు మగాళ్లతోనే బిజీ’ అని లహరిని నానా మాటలు అంది. ఈ గొడవ పెద్దది కాగా అందులో యాంకర్‌ రవి కూడా ఇరుక్కున్నాడు. అయితే తాను సింగిల్ మెన్ అనే మాట అన‌లేద‌ని ర‌వి చెప్ప‌గా,అదే విష‌యాన్ని నాగ్.. ప్రియ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించాడు.అందుకు తాను నో అని చెప్పింది.

ప్రియ తనను బ్యాడ్‌ చేయడానికి అలా చేస్తుందని, తనకు ఫ్యామిలీ ఉంది, కూతురు ఉంది అని సెంటిమెంట్‌ డైలాగులు వల్లించడంతో లహరి రవి తప్పు లేదని నమ్మేసింది. ఇక వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున.. రవిని.. ప్రియతో లహరి గురించి సింగిల్‌ మెన్‌ అన్నావా లేదా? అని నిలదీయగా.. వెంటనే ‘అన్నాను సర్‌’ అని మరోసారి మాట మార్చాడు. దీంతో షాకైన ప్రియ.. ఇప్పటివరకూ ఆ మాట అన్నానని రవి ఒప్పుకోలేదు సర్‌ అని చెప్పింది.

లహరికి ఆమె గురించి రవి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో చూపించడంతో అతడి నిజస్వరూపం బయటపడింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు రవికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అంటున్నారు. అయితే పాపం అన‌వ‌స‌రంగా ఇరుక్కున్న ల‌హరి త‌న మీద నెగెటివ్ ఇమేజ్ తెచ్చుకొని హౌజ్ నుండి ఎలిమినేట్ అయింది.