Bigg Boss 5 Grand Finale: బిగ్ బాస్‌లో ఫైవ్ మ‌చ్ ఫ‌న్.. సంద‌డి చేయ‌నున్న స్టార్స్ ఎవ‌రో తెలుసా?

Bigg Boss 5 Grand Finale: మ‌రి కొద్ది గంట‌ల‌లో బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంకి సంబంధించిన ఫినాలే కార్య‌క్ర‌మం సంద‌డి చేయ‌నుంది. ఇందులో విన్నర్ – రన్నర్ తో పాటుగా ఎవరి ప్లేస్ ఏంటనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక, విన్నర్ ఎవరనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ…ఫినాలే లో అతిధులు ఎవరనే దాని పైన కొంత కాలంగా అనేక మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

ఫైవ మ‌చ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనే విధంగా రాజమౌళి తో సహా బాలీవుడ్ ప్రముఖులు వస్తున్నారంటూ పలవురి పేర్లు వైరల్ అయ్యాయి. నెక్స్ట్ లెవెల్ ఎంటర్ టైన్ మెంట్ ఇక, ఈ సాయంత్రం ఫినాలే లో ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అందనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి నిర్వాహకులు ప్రోమో విడుదల చేసారు. హోస్టు నాగార్జున తన మార్క్ ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు సిద్దమైపోయారు.

బ్రహ్మాస్త్ర టీంతో కలిసి రాజమౌళి, ‘పుష్ప’ టీం, ‘శ్యామ్ సింగ రాయ్’ బృందం, ‘పరంపర’ మూవీ స్టార్స్ చేసిన సందడితో ‘బిగ్ బాస్-5’ వేదిక స్టార్స్ తో వెలిగిపోయింది. ఇక హౌజ్ మేట్స్ తో రాజమౌళి ఫన్, ‘శ్యామ్ సింగ రాయ్’ బ్యూటీలతో నాగార్జున పంచులు, శ్రియ స్పెషల్ డ్యాన్స్, ‘ఊ అంటావా’ సాంగ్ కు హీరోయిన్ అదిరిపోయే డ్యాన్స్, ఇంకా మాజీ హౌజ్ మేట్స్ తో పాటు గత సీజన్ల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేసే రచ్చ ప్రోమోలో చూపించారు.

ముందుగా రాజమౌళి, అలియా భట్, రణబీర్ కపూర్, జగపతి బాబు, నవీన్ చంద్ర, సుకుమార్, రష్మిక మందన్న, దేవి శ్రీ ప్రసాద్, కృతి శెట్టి, సాయి పల్లవి, నాని అతిథులుగా విచ్చేశారు. ఆర్ఆర్ఆర్ ఊర నాటు పాట..స్టెప్పులు అలియా భట్ ‘దబిడిదిబిడే’ అంటూ బాలయ్య డైలాగ్ చెప్పగా, రష్మిక ‘సామి సామీ’ స్టెప్పుతో అదరగొట్టేసింది. నాగార్జున ఆ స్టెప్పు సుకుమార్ తో వేయిస్తే ఎలా ఉంటుందని అడగడంతో ఒక్క సారిగా సుకుమార్ తో సహా నవ్వులు కురిపించాయి.

ఇక, ఆర్ఆర్ఆర్ సంచలన సాంగ్ ఊర నాటు స్టెప్పులతో హోరెత్తించారు. రాహుల్ సింప్లిగంజ్ ‘నాటు నాటు’ సాంగ్ ను పాడగా, దానికి యాని మాస్టర్, నటరాజ్ మాస్టర్ కలిసి స్టెప్పులు వేసారు. ఇక, ఆర్ఆర్ఆర్ మూవీ పైన రాజమౌళితో కలిసి వేసిన పంచ్ లు బాగా పేలాయి. ఫైవ్ మంచ్ ఫన్ ఇక, సందడికి సమయం దగ్గర పడుతోంది. స‌న్నీ విన్న‌ర్ అంటూ ప్ర‌చారం సాగుతుంది.