బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో ఎవ్వరికీ తెలీదు. నిన్నటి ఓ టాస్క్‌లో అరియానా మొహం ఒక్కసారిగా మాడిపోయింది. ఇకపై ఇంట్లో కెప్టెన్స్ ఉండబోరని, ఇప్పటి వరకు అయిన కెప్టెన్స్‌లో బెస్ట్ ఎవరు వరెస్ట్ ఎవరు అని చెప్పమన్నాడు. అలా ఇంటి సభ్యులందరూ ఒకచోట కూర్చుని దానిపై చర్చించారు. బెస్ట్ కెప్టెన్ ఎవరనే దానిపై ఎవరి జంట పేర్లు వాళ్లే చెప్పుకున్నారు. అఖిల్ సోహెల్ పేరు, సోహెల్ అఖిల్ పేరు, అరియానా అవినాష్ పేరు, అభిజిత్ హారిక పేరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొ సభ్యుడి పేరుచెప్పారు.

అలా చివరకు హారిక బెస్ట్ కెప్టెన్ అని తీర్మానించారు. అయితే గొడవంతా వరెస్ట్ కెప్టెన్ అని ఎవరు? అనే ప్రశ్న, దానికి పెట్టిన చర్చ వల్లే మొదలైంది. ఎవరికి నచ్చిన పేర్లు వారికి చెప్పారు. సోహెల్ అరియానా పేరు, అరియానా సోహెల్ పేరు, అవినాష్ అఖిల్ పేరు.. అఖిల్ అవినాష్ పేర్లు ఇలా చెప్పుకున్నారు. అభిజిత్ అఖిల్ పేరు చెప్పాడు. మోనాల్ అవినాష్ పేరు చెప్పింది. ఇలా ఎవరికి వారు చెప్పడంతో ఏకాభిప్రాయం రావడం లేదు.
చివరకు అవినాష్, అరియానా పేర్లు తెరపైకి రాగా.. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని వరెస్ట్ కెప్టెన్‌గా ఎన్నుకోండని చెప్పారు. దీంతో అందరూ కలిసి అరియానాను వరెస్ట్ కెప్టెన్‌గా డిసైడ్ చేశారు. దీంతో అరియానా మొహం మాడిపోయింది. అప్పటి వరకు మొహం బాగానే పెట్టుకుని తిరిగింది. వరెస్ట్ కెప్టెన్ అని నిర్ణయించడంతో మొత్తం డల్ అయిపోయింది. ఇంట్లో ఎవ్వరితోనూ సరిగ్గా మట్లాడటలేదు. ఎవ్వరూ కూడా అంతగా ఆమెను పట్టించుకోలేదు. అప్పటి వరకు ఉన్న జోష్ మొత్తం పోయింది. బోల్డ్ అని చెప్పుకుని తిరిగే అరియానా దెబ్బకు బొక్కబోర్లాపడింది.