అరియానా కథ ఏంటో అర్థమే కాదు.. అభిజిత్‌తో మళ్ళీ పులిహోర కలుపుతోంది!!

బిగ్ బాస్ షోలో అరియానా అతి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండడు. చివరకు ఆ అతిని భరించడమే తప్పా చేసేదేమీ లేదనే స్థాయికి వచ్చేశారు. కొన్ని సార్లు కరెక్ట్‌గానే మాట్లాడుతోందిగా అని అనుకునేలోపే తన అతిని చంపేస్తోంది. ప్రతీది అతిగా చేస్తుంది. కెమెరా, పుటేజ్ కోసం పాటు పడుతోన్నట్టుగా కనిపిస్తుంది. ఆమె చేష్టలన్నీ పుటేజ్ కోసం చేసే ప్రయత్నాల్లానే కనిపిస్తుంటాయి. అయితే అరియానా అభిజిత్ మధ్య చర్చలు, గొడవలు, ద్వేషాలు ఎప్పుడూ ఉంటూనే వస్తాయి.

bigg-boss-4-telugu-week-12-abhijeet-ariyana-becoming-close
bigg-boss-4-telugu-week-12-abhijeet-ariyana-becoming-close

సీక్రెట్ రూంలోంచి బయటకు వచ్చినప్పటి నుంచి అరియానా అభిజిత్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. మొదటి వారాంతం టాస్క్‌లో అభిజిత్‌ను డస్ట్ బిన్‌తో పోల్చడం నుంచి అసలు కథ మొదలైంది. ఇక అప్పటి నుంచి ఒకరినొకరు నామినేట్ చేస్తూనే వస్తున్నారు. అలా అభిజిత్ అరియానా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలానే వ్యవహారం వచ్చింది. కానీ మధ్యలో అభిజిత్ ఓ సారి డ్యాన్స్ పార్ట్నర్‌గా అరియానాను ఎంచుకోవడంతో దెబ్బకు షాక్ అయిపోయింది. ఆ రెండు మూడు వారాలు అభిజిత్ మీద అరియానా పడిపోయినంత పని చేసింది.

మళ్లీ ఆ మధ్య గొడవలు వచ్చాయి.. మా ఇద్దరికీ సెట్ కాదంటూ నాగార్జున ముందు చెప్పాడు. గత వారంలో ఇద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో అభిజిత్‌తో అరియానా కలిసి ముచ్చట్లు పెట్టింది. వారాలు గడుస్తున్న కొద్దీ నువ్వంటే ఇష్టం పెరుగుతోంది.. నువ్ ఉండే విధానం నచ్చుతోందని అభిజిత్‌కు సోప్ వేసే ప్రయత్నం చేసింది. దానికి అభిజిత్ కూడా రెడీగా ఉన్నట్టు కనిపించింది. మనం కలిసి పోదాం ఫ్రెండ్స్ అవుదామని ప్రయత్నించినా కూడా పరిస్థితులు అనుకూలించడం లేదని అభిజిత్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి మళ్లీ ఈ ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారేమో చూడాలి.

Advertisement