బిగ్ బాస్ షో కోసం రాహుల్ సిప్లిగంజ్ తెల్లార్లు జాగరమే చేయాల్సి వస్తోంది రాహుల్ సిప్లిగంజ్. ప్రతీవారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌ను బిగ్ బాస్ బజ్ కోసం ఇంటర్వ్యూ చేస్తాడు. అయితే అది మామూలు వారాల్లో అయిదే రాత్రి 9, 10 గంటల మధ్య అయిపోతుంది. ఏదో ఒక స్టేటస్ పెట్టేవాడు. కానీ ఈ సారి మాత్రం రాహుల్‌కు దిమ్మ తిరిగిపోతోన్నట్టు కనిపిస్తోంది. టాప్ 5 కంటెస్టెంట్లు బయటకు వచ్చే వరకు అక్కడే ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.


ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ షూటింగ్లో ఇద్దరిని మాత్రమే ఎలిమినేట్ చేసేశారని టాక్. టాప్ 5లో ఉన్న హారిక, అరియానాలు టైటిల్ రేసు నుంచి తప్పుకున్నారు. చివరికి వారి ప్రయాణం కనీసం టాప్ 2 వరకైనా చేరలేకపోయింది. అరియానా టాప్ 3లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా టాప్ 4కే పరిమితమైంది. అయితే ఈ ఇద్దరిని ఇంటర్వ్యూ చేసేందుకు రాహుల్ తెగ కష్టపడ్డట్టు కనిపిస్తోంది.
రాత్రంతా మేల్కొనే ఉన్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ షో షూటింగ్ ఎంతకీ కాకపోవడంతో తెల్లవారు ఝామున మూడున్నర గంటలకు పాటలు పాడుకుంటూ తన పరిస్థితిపై నవ్వుకున్నాడు. ఇంకా పంచాయితీ ఒడవడం లేదు.. మూడున్నర అవుతోంది.. తెల్లారుతోంది.. మన కథ ఏంది అంటూ రాహుల్ వాపోయాడు. మొత్తానికి నేటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం అంత రంగం సిద్దమైంది. ఇక విజేత అభిజిత్ అన్నది అందరికీ తెలిసిపోయింది. కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.