అలాంటి వాటిలో ముందుంటాడు… సోహెల్ పై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్
NQ Staff - December 12, 2020 / 10:49 AM IST

బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. ఈ మధ్య వార్తల్లో వైరల్ అవుతున్నాడు. నాల్గో సీజన్‌కు సంబంధించి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చేస్తూ బిజీగా ఉన్నాడు. అదే తరుణంలో తన అభిప్రాయం చెబుతూ.. కంటెస్టెంట్లకు మద్దతుగా నిలుస్తున్నాడు. మొదటగా నోయల్‌కు సపోర్ట్ ఇచ్చిన రాహుల్.. ఆ తరువాత అభిజిత్‌కు మద్దతు తెలపడం ప్రారంభించాడు. ఆ తరువాత సడెన్‌గా సోహెల్, అరియానా వైపు షిప్ట్ అయ్యాడు. అభిజిత్ ఎలాగూ సేవ్ అవుతాడు.. అందుకే ఈ ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నాను అని రాహుల్ అంటున్నాడు.

bigg-boss-4-telugu-rahul-sipligunj-supports-only-sohel
అయితే ఈ పద్నాలుగో వారంలో మాత్రం అరియానా, సోహెల్ మధ్య గొడవలు బీభత్సంగా జరిగాయి. ఇంకా ఆ గొడవలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ఇద్దరికీ రాహుల్ గట్టిగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈ వారం మొత్తం ఈ ఇద్దరి గొడవల చుట్టే జరిగింది. ఈ ఇద్దరికి సపోర్ట్ చేసే రాహుల్.. ఇప్పుడు ఎలా స్పందిస్తాడో అని అందరూ ఎదురుచూశారు. తాజాగా రాహుల్ సోహెల్‌కు సపోర్ట్ చేస్తూ అరియానాను పక్కకు పెట్టేశాడు.

bigg-boss-4-telugu-rahul-sipligunj-supports-only-sohel
సోహెల్ గురించి రాహుల్ చెబుతూ.. ఇంట్లో అన్ని రకాల ఎమోషన్స్ చూపెట్టి.. ఎంటర్టైన్ చేస్తుంటాడు.. ముక్కుసూటిగా మాట్లాడతాడు.. పాజిటివ్‌గా ఉంటాడు.. మిగతా వాళ్లను కూడా వంద శాతం ఎంకరేజ్ చేస్తూ టాస్కులు బాగా ఆడేలా ప్రోత్సహిస్తుంటాడు. అతని స్నేహితులకు ఎంతోవిధేయుడిగా ఉంటాడు. ఎవ్వరు హర్ట్ అయినా కూడా చూడలేదు.. సమస్యలు కనుక్కొని పరిష్కరిస్తుంటాడు. అతనికి షార్ట్ టెంపర్ ఉంది కానీ అదేమీ అంత పెద్ద సమస్య కాలేదు..అది అతనిలోని సమస్యే.. దాన్ని ఎప్పుడూ కూడా కప్పి పుచ్చుకోవాలని చూడలేదు.. ఎలాంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరించుకునేందుకు ముందడుగు వేస్తుంటాడు.. ఎంతో నిష్ఫక్షపాతంగా ఉంటాడు.. మనందరిలో ఒకడిలా ఉంటాడని చెప్పుకొచ్చాడు.