బిగ్ బాస్4: అరియానా అతికి అడ్డుకట్ట.. కిచ్చా సుదీప్ పంచ్ అదుర్స్

బిగ్ బాస్ షోలో అరియానా అంటే అతికి మారుపేరు అన్న సంగతి తెలిసిందే. ఆమె అతికి అంబాసిడర్‌గా మారిపోయింది. ధైర్య సాహసాలు, మెండిదనం, పోరాడేతత్త్వం ఇలా అన్నీ ఉన్నా కూడా వాటిని అతి అనే ఈ గుణం మాత్రం అధిగమిస్తోంది. ఆమెను పొగిడే లోపే ఈ అతితో ఆ వచ్చిన పేరును పోగొట్టుకుంటోంది. మొత్తానికి అరియానా కాస్తా అతియానాగా మారింది. నాల్గో సీజన్‌లో స్ట్రాంగెస్టెంట్ లేడీ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది.

Bigg Boss 4 Telugu Kiccha Sudeep Punch To Ariyana
Bigg Boss 4 Telugu Kiccha Sudeep Punch To Ariyana

అయితే ఈ అరియానా అతికి కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ అడ్డుకట్ట వేశాడు. నిన్నటి ఎపిసోడ్‌లో సుదీప్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున సుదీప్ కలిసి ఇంటి సభ్యులను కాసేపు ఆడుకున్నారు. నాగార్జునను మీరు విసిగించారట.. ఇంటికి వెళ్లిపోయాడని సుదీప్ చెప్పాడు. నాగార్జున మళ్లీ రావాలంటే ఓ పని చేయాలని చెప్పాడు. ఆయన మళ్లీ ఎందుకు రావాలో మీ అందరూ ఒక్క మాటలో చెప్పండని తెలిపాడు. ఈ క్రమంలో హారిక నుంచి మొదలుపెట్టండని తెలిపాడు.

హారిక సింపుల్‌గానే చెప్పేసింది. మేము ఆయన్ను లవ్ చేస్తున్నాము. ఆయన మమ్మల్ని లవ్ చేస్తారు అని ఏదో చెప్పేసింది. ఇక అందరూ ఏదో ఒకటి చెబుతూ ఉంటే.. అరియానా మాత్రం చాటభారతం చెప్పింది. మాకోసం ఏదో తెచ్చాడు. ఎక్కడికో వెళ్లినప్పుడు మమ్మల్ని గుర్తు పెట్టుకుని తెచ్చాడు. కేరింగ్ లవ్ అంటూ ఏదో చెప్పాడు. అంటే అవి నేను కూడా తేస్తాను అని సుదీప్ పంచ్ వేశాడు. ఇక మళ్లీ అరియానా ఏదో చెప్పబోతోంటే ఇక చాలు ఆపమ్మా అనేలా ఓ చూపు చూసి.. నెక్స్ట్ చెప్పండని పక్కవారి దగ్గరికి వెళ్లాడు. ఈ అందరిలోనూ ఒక్క అభిజిత్ మాత్రం ఒక్క మాటలో చెప్పాడు. నాగ్ సర్ ఈజ్ కింగ్.. నాగ్ సర్ ఈజ్ బెస్ట్ హెస్ట్ అని సింపుల్‌గా చెప్పేసి సుదీప్ మనసు దోచేశాడు.

Advertisement