అన్ని రికార్డ్‌లు బద్దలు.. బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ టీఆర్పీ ఎంతంటే?

NQ Staff - December 31, 2020 / 12:28 PM IST

అన్ని రికార్డ్‌లు బద్దలు.. బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ టీఆర్పీ ఎంతంటే?

బిగ్ బాస్ నాల్గో సీజన్ ఫినాలే ఎపిసోడ్ ఎంత గ్రాండ్‌గా జరిగిందో అందరికీ తెలిసిందే. చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం, లక్ష్మీ రాయ్, ప్రణీత, మెహ్రీన్, అనిల్ రావిపూడి వంటి వారంత రావడం, జనాలకు కూడా ఎలాంటి కాలక్షేపం లేకపోవడం, స్టార్ మా కూడా ఈ సారి గట్టిగాప్రచారంచేయడంతో బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌ గ్రాండ్‌గా సక్సెస్ అయింది. సాయంత్రం ఆరుగంటలకు మొదలైన ఎపిసోడ్.. దాదాపు పదకొండు గంటల వరకు కొనసాగింది.

TRR

విజేతగా నిలిచిన అభిజిత్ కంటే సోహెల్, మెహబూబ్‌లు హైలెట్ అవుతారని ముందే లీకులు రావడంతో అందరూ ఆసక్తిగా తిలకించారు. అలా ఫినాలే ఎపిసోడ్ గ్రాండ్ హిట్ అయింది. తాజాగా వాటి లెక్కలన్నీ బయటకు వచ్చాయి. నాల్గో సీజన్ గత సీజన్ల రికార్డులను చెరిపేసింది. అన్నింటి కంటే ఎక్కువగా టీఆర్పీ సాధించిన సీజన్‌గా నాల్గో సీజన్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ లెక్కలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి.

TRp

బిగ్ బాస్ నాల్గో సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు 19.51 రేటింగ్ వచ్చింది. అదే సమయంలో మొదటి సీజన్‌లో 14.13, రెండో సీజన్‌లో 15.05, మూడో సీజన్‌లో 18.29 రేటింగ్స్ వచ్చాయి. అలా ప్రతీ సీజన్‌కు సరికొత్త రికార్డులుక్రియేట్ అవుతూనే ఉన్నాయి. అలా ఈ నాల్గో సీజన్ గత మూడు సీజన్ల రికార్డులను బద్దలు కొట్టేయడంతో కంటెస్టెంట్ల సత్తా ఏంటో అందరికీ తెలుస్తోంది. నాగార్జున తన రికార్డును తానే బద్దలు కొట్టినట్టు అయింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us