Mehaboob Dilse: చిన్న‌ప్ప‌టి క‌ల నేర‌వేర్చుకున్న మెహ‌బూబ్.. ఆనందంతో ఎమోష‌న‌ల్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్

Mehaboob Dilse బిగ్ బాస్ తర్వాత చాలా మంది ఓ రేంజ్ స్థాయికి చేరుకున్న విష‌యం తెలిసిందే. ‘గుంటూరు మిర్చి’లాంటి కుర్రాడు మెహబూబ్‌ దిల్‌సే..యూట్యూబ్‌, టిక్‌టాక్‌ వీడియోలతో ఫేమస్ అయిన విష‌యం తెలిసిందే. ఆ క్రేజ్‌తో అతడు గతేడాది బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టాడు. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడే మెహబూబ్‌ ఫ్రెండ్‌షిప్‌కు కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు.

బిగ్‌బాస్‌ ద్వారా కేవలం పాపులారిటీ మాత్రమే కాకుండా మంచి మిత్రులను, ఎన్నో ఆఫర్లను అందుకున్నాడు. అంతేకాకుండా ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి కంట్లో కూడా పడ్డాడు. బిగ్ బాస్ నాల్గో సీజన్ ఫినాలే రోజు.. సోహెల్‌ రూ. 25 లక్షలతో డీల్ కుదుర్చుకున్నాడు. దాంతో అభిజిత్‌కు విన్నర్‌గా దక్కాల్సిన వాటిలో యాభై శాతం కోతపడింది.

సోహెల్ తనకు వచ్చిన దాంట్లో మెహబూబ్‌కు ఐదు లక్షలు ఇస్తాను అని ప్రకటించాడు. దీంతో సోహెల్ మంచి మనసుకు కరిగి చిరంజీవి పది లక్షలు రివర్స్‌లో ఇచ్చాడు. నాగార్జున కూడా అందులో చేయివేశాడు. చివరకు రన్నర్ అయిన అఖిల్‌కు సున్నం పడ్డట్టు అయింది.

ఎప్ప‌టి నుండో ఇల్లు క‌ట్టుకోవాల‌నేది మెహ‌బూబ్ క‌ల కాగా, ఎట్ట‌కేల‌కు తీరింది. కొత్తింట్లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు మెహు. ‘ఒక సొంతిల్లు ఉండాలి, కట్టుకోవాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. మొత్తానికి అనుకున్నది సాధించాం. మీ అందరి వల్లే ఇక్కడిదాకా వచ్చాము. మమ్మల్ని ఆశీర్వదించిన భగవంతుడికి కృతజ్ఞతలు.

అలాగే నాకు సపోర్ట్‌ చేసిన అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఇదిలా వుంటే ప్రస్తుతం మెహబూబ్‌ వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు. ఓ పక్క వెబ్‌సిరీస్‌లు చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు మిర్చి వెబ్‌ సిరీస్‌ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది.