BIG UPDATE: తెలుగులో స్ట్రైట్ మూవీ చేయ‌బోతున్న త‌మిళ స్టార్ హీరో.. క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో అనేక మార్పుల‌ని గ‌మ‌నిస్తున్నాం. ఒక‌ప్పుడు హీరోలు ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల‌లోనే న‌టించేవారు. కాని ఇప్పుడు డీ గ్లామ‌ర‌స్ లుక్‌లోను క‌నిపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అంతేకాదు త‌మ సినిమాల‌ని ఒక్క బాష‌కే ప‌రిమితం కాకుండా అన్ని భాష‌ల‌లో విడుద‌ల‌య్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. గ‌త కొద్ది రోజులుగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో వంశీ పైడిప‌ల్లి ఓ ప్రాజెక్ట్ చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా ఓ క్లారిటీ వ‌చ్చింది.

మ‌హ‌ర్షి అనే సినిమాని 2019లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన వంశీ పైడిప‌ల్లి ప్ర‌స్తుతం విజ‌య్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవల వంశీ విజయ్ ని కలిసి కథ విన్పించగా… లైన్ నచ్చిన విజయ్ సినిమా చేయటానికి అంగీకారం తెలిపాడట. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తారట. మహేష్ బాబు, రామ్ చరణ్ లు రిజెక్ట్ చేసినప్పటికీ దర్శకుడు వంశీ పైడిపల్లి చివరకు విజయ్ తో కలిసి పాన్-ఇండియన్ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. అయితే మొన్నటి వ‌ర‌కు ఇది పుకారుగానే ఉండ‌గా, ఇప్పుడు దీనిపై స్పందించాడు వంశీ. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విజ‌య్- దిల్ రాజు కాంబినేష‌న్‌లో సినిమా చేయ‌బోతున్న‌ట్టు తెలియ‌జేసిన వంశీ క‌రోనా పాండ‌మిక్ త‌గ్గాక అనౌన్స్ చేస్తాన‌ని పేర్కొన్నాడు.

మహేష్ బాబుతో వంశీ చేయాలనుకున్నదానికంటే ఇది పెద్ద ప్రాజెక్ట్ కానుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతోందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. కీర్తి సురేష్ ఇంతకు ముందు విజయ్ తో కలిసి రెండు సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ చిత్రం అవుతుంది. వంశీ స్వయంగా ప్రస్తుతం ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాసే పనిలో బిజీగా ఉన్నారు. తాజా నివేదికల ప్రకారం, వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అన్ని వాణిజ్య అంశాలను జోడించనున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం విజయ్ తన రాబోయే సినిమా #Thalapathi65తో బిజీగా ఉన్నాడు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించే ఈప్రాజెక్టు పూర్తికాగానే, వంశీతో సినిమా చేయనున్నాడు.