Actor Chaurasia : చౌరాసియా కేసులో కొత్త కోణం.. పొద‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసిన దుండ‌గుడు

Actor Chaurasia : న‌టి చౌరాసియాపై దాడి కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. కేబీఆర్ పార్కులో వాకింగ్‌ చేయడానికి వచ్చిన ఆమెపై ఒక వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మొబైల్‌ ఫోన్‌ను అతను లాక్కెళ్లాడు. ఈ కేసుపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

big twist in Actor Chaurasia attack case
big twist in Actor Chaurasia attack case

చౌరాసియా పెదాలు, మెడపై గాయాలున్నట్టు గుర్తించారు పోలీసులు . చౌరాసియాను అతడు చెట్ల పొదల చాటుకు తీసుకెళ్లే యత్నం చేశాడనీ.. ఈ క్రమంలోనే ఆమె కాలి మడమకు ఫ్రాక్చర్ అయిందనీ.. భావిస్తున్నారు. దీంతో నిందితుడు ఒక సైకోగా అంచనా వేస్తున్నారు పోలీసులు.

ఇదిలా ఉంటే ఇక స్టార్ బక్స్ ఎదురుగా.. ఉన్న ఘటనాస్థలి అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనీ.. చెప్పుకొస్తున్నారు.. ఈఏరియాలో జాగింగ్ చేసే క్రమంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని వాకర్లను హెచ్చరిస్తున్నారు. దాడి నుండి బయట పడడానికి నేను ప్రతిఘటించడం జరిగింది. ఈ క్రమంలో నా ముఖంపై గుద్దాడు.. అని చౌరాసియా తెలియజేశారు.

దాడి అనంతరం ఆమె మొబైల్ తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించడం జరిగింది. అయితే ఆ ప్రాంతాన్ని కవర్ చేస్తున్న సీసీ కెమెరా పని చేయకపోవడంతో దాడి దృశ్యం రికార్డు కాలేదు. మరో కెమెరాలో మాత్రం షాలు భయంతో పరుగెడుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. నటి చౌరాసియాపై దాడి చేసింది ఒక సైకో అని పోలీసులు గుర్తించారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న మిగతా సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. దాడి చేసిందని పాత నేరస్తులని మొదట పోలీసులు భావించారు. అయితే ఇది ఓ సైకో పని అని వాళ్ళ దార్యప్తులో తేలింది. నటి చౌరాసియా కోసం ప్రత్యేకంగా ఆ సైకో వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతడిని పట్టుకోవడానికి పోలీసులు నాలుగు బృందాలు ఏర్పడి జల్లెడ పడుతున్నారు.