ఆచార్య నుంచి బిగ్ సర్‌ప్రైజ్ .. మెగా ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సోనూసూద్.. తణికెళ్ళ భరణి లాంటి ప్రముఖ నటులు పాల్గొంటున్న కీలక సన్నివేశాలను చిత్రీకర్తిస్తున్నారు. మెగాస్టార్ కూడా త్వరలో ఆచార్య సెట్ లో జాయిన్ కాబోతున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి లేదా సెకండ్ వీక్ నుంచి కాజల్ అగర్వాల్ కూడా షూటింగ్ లో జాయిన్ కాబోతోందని అంటున్నారు. కాగా ఈ సినిమా నుంచి మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే అప్‌డేట్ ఒకటి బయటకి వచ్చింది.

Bheem for Ramaraju-RRR(Telugu)-Happy Birthday Ram Charan/NTR,Ajay Devgn/SS  Rajamouli - YouTube

ప్రస్తుతం రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ “ఆర్ ఆర్ ఆర్ ”లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజైన రామరాజు ఫర్ భీం టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. కాగా ఒకవైపు నుంచి రాజమౌళి ఈ మల్టీ స్టారర్ మీద ఎప్పటి కప్పుడు అంచనాలు పెంచుతూ వస్తున్నారు.

Chiranjeevi confirms that Ram Charan is in cast of 'Acharya' | The News  Minute

అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. దాంతో ఆచార్య లో చరణ్ ఎప్పుడు జాయిన్ కాబోతున్నాడో ఒక క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం చరణ్ 2021 జనవరి నుంచి ఆచార్య సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడని తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఆచార్య సినిమాకి డేట్స్ ఇచ్చినట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుందట. దాదాపు ఇది కన్‌ఫం న్యూస్ అంటున్నారు.

ఇక ఈ సినిమా కోసం భారీ సెట్ ని కూడా సిద్దం చేస్తున్నారట. పలు కీలకమైన సన్నివేశాలని ఆ సెట్ లో చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రెజీనా కసాండ్ర మెగాస్టార్ మీద ఇప్పటికే ఒక సాంగ్ ని కంప్లీట్ చేశాడు కొరటాల. 2021 సమ్మర్ కానుకగా ఆచార్య ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement