RAVI TEJA: తగ్గేదే లే.. బాక్సాఫీస్ దగ్గర బాలకృష్ణతో పోటీ త‌ప్ప‌దంటున్న ర‌వితేజ‌

ఇప్పుడు వీరిద్దరి తీరు చూస్తుంటే నిజంగానే ఇదే అనిపిస్తుంది. కరోనా వైరస్ కారణంగా చాలా సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. కానీ బాలకృష్ణ, రవితేజ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. అనుకున్న టైమ్ కు.. అనుకున్న తేదీకి తమ సినిమాలు విడుదల అవుతాయని బల్లగుద్ది మరి చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే మే 28న ఇద్దరి సినిమాలు పోటీ పడుతున్నాయి. రవితేజ ఖిలాడి సినిమాతో వస్తుంటే.. అఖండ సినిమాతో బాలయ్య గర్జన చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి.

క్రాక్ విజయంతో ట్రాక్ ఎక్కిన రవితేజ ఖిలాడితో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరోవైపు బోయపాటి శ్రీను అండ చూసుకొని బాలయ్య బాక్సాఫీస్ ను దత్తత తీసుకోవాలని చూస్తున్నాడు. అన్నింటికి మించి రవితేజ, బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర పోటీ పెడితే వచ్చే మజా వేరు. దాదాపు 15 ఏళ్ళ కింద ఒక హీరోయిన్ విషయంలో ఇద్దరు హీరోల మధ్య గొడవ జరిగిందని.. అప్పుడు రవితేజపై బాలకృష్ణ చేయి చేసుకున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తాయి. అందుకే ప్రతిసారి బాలయ్య సినిమాలపై రవితేజ పోటీకి వస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

2008లో ఒక్క మగాడు సినిమాకు కృష్ణ సినిమాతో అడ్డుకట్ట వేశాడు మాస్ రాజా. 2011లో పరమ వీర చక్రకు మిరపకాయ్ ఘాటు రుచి చూపించాడు. ఇక ఇప్పుడు మరోసారి ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు. ఒక వైపు కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు. మే 28న పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇద్దరు హీరోలు వస్తే మాత్రం ఖచ్చితంగా బాక్సాఫీస్ వేడెక్కడం ఖాయం.

Advertisement