బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుంది ఇతడే..!

Advertisement

బిగ్ బాస్ ఫోర్ మొదలైన కొత్తలో కాస్త నిరుత్సాహపరిచిన.. ప్రస్తుతం రోజురోజుకు ప్రేక్షకులకు మరింత ఆసక్తికారాన్ని పెంచుతుంది. ఇప్పటికే సూర్య కిరణ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అలాగే కుమార్ సాయి, ముక్కు అవినాష్ వైల్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ వారంలో మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అవ్వగా దాంట్లో, నిన్నటి ఎపిసోడ్ లో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయింది. ఇక గంగవ్వ సేఫ్ జోన్ లో ఉంది. ఇక అభిజిత్, మోనాల్, నోయల్, రాజశేఖర్, హారిక, కుమార్ సాయి, సోహెల్ వీరందరిలో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వనున్నారు.

దీనితో ప్రేక్షకులు అందరు కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటె సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కుమార్ సాయి ఈ రోజు ఎలిమినేట్ అవ్వనున్నాడని తెగ ప్రచారం అవుతుంది. ఎందుకంటె నిన్న జరిగిన హీరో/జీరో టాస్క్ లో కుమార్ సాయి ఎక్కువ మంది చేతిలో జీరో అయ్యాడు. దీనితో కుమార్ సాయి ఎలిమినేట్ అవ్వనున్నాడని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ చూస్తే ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here