VISMAYA బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అంటే టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో ఎంతో అభిమానం ఉంది. తమ సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్స్ అయినా అమితాబ్ అంటే ఎనలేని గౌరవం.. అభిమానం. ఇలాంటి ప్రేమ తనపై ఉన్నందుకు బిగ్ బీ ఎన్నో సార్లు అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నారు. అయితే ఇటీవల మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అమితాబ్ కు ఓ గిఫ్ట్ ని పంపారు. అదేంటో కాదు తన కూతురు విస్మయ రాసిన గ్రెయిన్ ఆఫ్ స్టార్ డస్ట్ అనే పుస్తకం. ఈ బుక్ ని మోహన్ లాల్, అమితాబ్ కు పంపారు. ఈ విషయాన్ని బిగ్ బీ తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ పుస్తకం పంపినందుకు బిగ్ బీ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ధన్యవాదాలు తెలిపారు. ఆయన మోహన్ లాల్ కూతురు విస్మయకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అమితాబ్ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ.. మోహన్ లాల్, మలయాళం సూపర్ స్టార్ అంటూ పొగుడుతూ.. తాను ఎంతగానో అభిమానించే వ్యక్తి అని.. అలాగే తన కూతురు రాసిన పుస్తకం తాను చదివానని.. అందులో ఎంతో అంతులేని సృజనాత్మకత దాగుందని.. అందులో ఉన్న ప్రతి కవిత్వం, పెయింటింగ్ తనను ఆకట్టుకున్నాయని, అలాంటి ఓ అద్భుతమైన పుస్తకాన్ని తనకోసం పంపించినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అలాగే విస్మయ ప్రతిభను మెచ్చుకుంటూ ఆమెకు మై బెస్ట్ విషెస్ టూ విస్మయ అంటూ ట్వీట్ చేశారు.
ఇక బిగ్ బీ ట్వీట్ కు మోహన్ లాల్ స్పందిస్తూ.. బాలీవుడ్ లెజండరీ సూపర్ స్టార్ నుండి తన కూతురు ప్రశంసలు అందుకుందంటే సాధారణ విషయం కాదని.. తన కూతురు ఎంతో అదృష్టవంతురాలని.. ఓ తండ్రిగా ఇది తనకు గర్వించే సమయం అని.. థ్యాంక్యూ బచ్చన్ సార్ అంటూ రీట్వీట్ చేశారు. ఇక మోహన్ లాల్ కూతురు విస్మయ రాసిన గ్రెయిన్ ఆఫ్ స్టార్ డస్ట్ అనే పుస్తకాన్ని పెంగిన్వి ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మోహన్ లాల్ ఈ నెల 14 న ఆవిష్కరించారు.
Words of appreciation coming from a legend is the best compliment and blessing Maya can get ! As for me this is the proudest moment as a father. Thank you @SrBachchan Sir. https://t.co/RdTtZmRGLr
— Mohanlal (@Mohanlal) February 23, 2021