Bhumika Chawla : అలా వెళితేనే ఆఫ‌ర్స్ వ‌స్తాయా.. భూమిక సంచ‌ల‌న కామెంట్స్

Bhumika Chawla : పవన్ కళ్యాణ్‌, మహేష్ బాబు, ఎన్టీఆర్ లకు భూమిక లక్కీ హీరోయిన్. వీరి ముగ్గురితో భూమిక నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఖుషీ సినిమాతో స్టార్‌ స్టేటస్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా ఒక్కడు, సింహాద్రి వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలతో టాప్‌ హీరోయిన్‌గా దూసుకెళ్లింది.

bhumika chawla shocking comments about films
bhumika chawla shocking comments about films

ప్రస్తుతం భూమిక‌ వయసు 43 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. కానీ భూమిక ఎప్పుడూ వెండి తెరకు దూరంగా లేదు. తన వయసుకు తగ్గ రోల్స్ చేస్తూనే ఉంది. అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. రీసెంట్ గా భూమిక సీటీమార్ చిత్రంలో గోపీచంద్ కు అక్క పాత్రలో నటించింది.

హీరోయిన్‌గా మాంచి ఫామ్‌లో ఉన్నప్పుడే 2007లో నిర్మాత భరత్ ఠాకూర్‌ని పెళ్లాడిన భూమిక..ఆ తర్వాత హీరోయిన్‌ రోల్స్‌కి గుడ్‌బై చెప్పింది. రీఎంట్రీ అనంతరం అక్క, తల్లి , వదిన వంటి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్రలతో అలరిస్తుంది.అయితే ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్‌కు బూస్టప్‌ను ఇవ్వలేకపోయాయి.

దీనికి ప్రధాన కారణం భూమిక ఎక్కువగా సెలబ్రిటీలతో కలవదని, ప్రైవేటు పార్టీలకు సైతం వెళ్లదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన ఆమె..’పార్టీలకు వెళ్తే తప్పా మంచి రోల్స్‌ రావా? అలాంటి మాటలను నేను ఎంకరేజ్‌ చేయను. ఫిల్మ్‌ మేకర్స్‌తో రోజూ టచ్‌లో ఉంటేనే అవకాశాలు వస్తాయన్నది భ్రమ మాత్రమే.

నా కోసమే పాత్రలు రాసి, నా కోసం ముంబై వచ్చిన మేకర్స్‌ చాలా మంది ఉన్నారు’ అని చెప్పుకొచ్చింది భూమిక‌. ఈ అమ్మ‌డు తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది. ముఖ్యంగా తళుకుబెళుకులు ఉన్న వైట్ స్లీవ్ లెస్ డ్రెస్ లో భూమిక మైండ్ బ్లోయింగ్ హాట్ నెస్ తో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.