స్విమ్ సూట్ లో తన అందాలను ఆరబోసిన ముద్దుగుమ్మ.. ఇప్పటికీ తన అందం ఏమాత్రం తగ్గలేదు

స్విమ్ సూట్ లో హీరోయిన్స్ ఈ మధ్య బోల్డ్ గా కనిపిస్తున్నారు. టాలీవుడ్  మాత్రమే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన చాలామంది హీరోయిన్స్ స్విమ్ సూట్ లో ఫోటోషూట్ చేసిన వాళ్లే. స్విమ్ సూట్ లో ఫోటో షూట్ అంటే మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే ఉంటుంది. ఆ ఫోటోలు కనుక సోషల్ మీడియాలో అప్ లోడ్ అయితే సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. కుర్రకారుకు నిద్రలేని రాత్రులే ఇక. అయితే.. నేటి కుర్ర హీరోయిన్లు స్విమ్ సూట్ లో ఫోటోషూట్ చేస్తే ఓకే అనుకోవచ్చు కానీ.. ఓ సీనియర్ హీరోయిన్ అది కూడా మూడు పదుల వయసులో కవ్విస్తోందంటూ మామూలు విషయం కాదు. ఆ హీరోయిన్ స్విమ్ సూట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

bhumika chawla latest swim suit photo goes viral
bhumika chawla latest swim suit photo goes viral

ఇంతకీ.. ఎవరా సీనియర్ హీరోయిన్ అంటారా? ఇంకెవరు మన ఖుషీ గర్ల్ భూమిక చావ్లా. తను ఇండస్ట్రీకి వచ్చే 20 ఏళ్లు అయి ఉంటుంది. ఇప్పటికే తన వయసు 30 ఏళ్లు దాటి ఉంటుంది. తనను ఇప్పుడు అక్క, వదిన క్యారెక్టర్లు చేస్తోంది. అయినప్పటికీ ఈ వయసులో కూడా తన గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది భూమిక. 2007లోనే తనకు వివాహం అయినా కూడా ఇప్పటికీ తన అందం మాత్రం అస్సలు తగ్గలేదు. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన స్విమ్ సూట్ ఫోటో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఈ వయసులో కూడా ఇంత అందమా? అంటూ నెటిజన్లు.. భూమిక షేర్ చేసిన ఫోటోపై కామెంట్లు చేస్తూ దాన్ని వైరల్ చేస్తున్నారు.