Bigg Boss House : భోలే షావలి ఎలిమినేట్.. హౌస్ లో శ్రీలీల-వైష్ణవ్ తేజ్ సందడి..!
NQ Staff - November 13, 2023 / 09:19 AM IST

Bigg Boss House :
బిగ్ బాస్-7 తొమ్మది వారాలు కంప్లీట్ చేసుకుంది. తాజాగా పదో వారం ఆదివారం ఎపిసోడ్ కూడా వచ్చేసింది. బిగ్ బాస్ లో అన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఆదివారం ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. ఇక పదో వారం ఆదివారం ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది. పైగా దీనికి తోడు దీపావళి కూడా తోడయింది. దాంతో ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ను కూడా నిర్వహించారు. దాంతో బిగ్ బాస్ ను ట్రెడీషనల్ గా మార్చేశారు. నాగార్జున కూడా ట్రెడీషనల్ లుక్ లోనే ఎంట్రీ ఇచ్చారు. అందరూ అదిరిపోయే డ్యాన్స్ లతో అదరగొట్టేశారు.
ఆ తర్వాత బిగ్ బాస్ ప్రేక్షకులకు అందరికీ దీపావళి విషెస్ చెప్పారు. అయితే ఈ క్రమంలోనే హౌస్ మేట్స్ కు ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఒక నిముషం ట్రైమ్ ఫ్రేమ్ లో ఐదు టీమ్ లు క్రాకర్స్ కార్డ్స్ ను తమ బు్టలో వేయాలి. ఇలా వేసే వాటికి సెపరేట్ గా మార్కులు కూడా ఇస్తుంటారు. ఈ గేమ్ లో యావర్ – అశ్విని, అమర్ దీప్ -ప్రియాంక, భోలే – అర్జున్, గౌతమ్ – శోభా, యావర్ – రతిక టీమ్ గా ఆడారు. అందరికంటే ఎక్కువగా అమర్ దీప్-ప్రియాంక 410 స్కోర్ చేశారు. దాంతో నాగార్జున వారిని ప్రశంసించాడు. ఇక గౌతమ్ కృష్ణ – శోభా 75 స్కోర్ చేశారు.
అయితే టాస్క్ గెలిచిన అమర్ దీప్, ప్రియాంకలకు సర్ ప్రైజ్ ఇచ్చాడు నాగార్జున. హౌస్ లోకి అమర్ దీప్ తల్లి, హీరో మానస్ లను పంపించాడు. తల్లి కనిపించగానే అమర్ దీప్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక మానస్ కూడా తన దైన స్టైల్ లో అమర్ తో పాటు మిగతా కుటుంబ సభ్యులకు సలహాలు ఇచ్చాడు. ఇక గౌతమ్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆయన సోరుదలను ఇంట్లోకి తీసుకొచ్చారు. దాంతో నామినేషన్స్ లో ఉన్న గౌతమ్ ను సేవ్ చేశారు. ఆ తర్వాత రకరకాల కలర్స్ ఉండే చాక్లెట్స్ ను ఇచ్చారు. తర్వాత వివిధ రకాల కలర్స్ గల కవర్స్ కలిగిన చాక్లెట్స్ ను కంటెస్టెంట్లకు అందించారు.

Bhole Shavali Eliminated 10th Week Of Bigg Boss House
ఆ తర్వాత ప్రిన్స్ యావర్, రతిక రోజ్, భోలే షావలి చివరి దశకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కావడంతో స్టేజి మీదకు శ్రీలీల-వైష్ణవ్ తేజ్ వచ్చారు. ఈ సందర్భంగా హౌస్ మేట్స్ తో వారు సరదాగా గడిపారు. అనంతరం స్టేజి మీదకు హైపర్ ఆది కూడా వచ్చాడు.
ఈ సందర్భంగా తన పంచ్ లతో కాసేపు అలరించాడు. అనంతరం రతికను నామినేషన్స్ నుంచి సేవ్ చేశారు నాగార్జున. చివరకు ప్రిన్స్ యావర్, భోలే షావలి ఇద్దరు మిగిలారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు హౌస్ ను వీడాల్సి వచ్చింది. చివరకు భోలే షావలి ఎలిమినేట్ అయిపోయాడు.