Sarkaru vari paata : ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన చిత్రం సర్కారు వారి పాట.మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా టాక్ సంగతి ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం భారీగా వస్తున్నాయి. దీంతో ఈ సినిమా త్వరలోనే హిట్ స్టేటస్ సాధించడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కొన్ని లాజిక్ లేని సీన్స్ తీశారు అనే వాదన ఉంది. అయితే అనేక ప్రచారాల నడుమ పరశురాం మీడియాతో పలు విషయాలు షేర్ చేసుకున్నారు.

హీరోయిన్ పై కాలు వేసుకొని పడుకునే ఎపిసోడ్ పై తనదైన స్టైల్ లో లాజికల్ గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు పరశురామ్. ఇందులో అసలు వల్గారిటీ ఏ మాత్రం లేదని, చిన్నప్పుడు తల్లిని కోల్పోయిన మహేష్ పాత్ర హీరోయిన్ ను అమ్మలా చూసుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఆ సన్నివేశాల్లో వల్గారిటీ లేదని, ఉంటే మహేష్ బాబు అసలు చేసేవారే కాదని పరశురామ్ పేర్కొన్నాడు. ఇక పిల్లలు ఎప్పుడూ తల్లి పక్కన పడుకోవాలి అనుకుంటారని, అలాగే వీరి మధ్య బంధం కూడా స్వచ్ఛమైనది అని ఆయన క్లారిటీ ఇచ్చారు.

సర్కారు వారి పాట సినిమాలో పదే పదే సుబ్బరాజు కు హీరో మహేష్‌బాబు కాల్ చేస్తుంటాడు. దీంతో సుబ్బరాజు ఫోన్ మోగినప్పుడల్లా ‘లాలా.. భీమ్లా’ అనే రింగ్ టోన్ వినిపిస్తుంది. ఈ రింగ్ టోన్ వినిపించినప్పుడల్లా థియేటర్లలో పవర్ స్టార్ అభిమానులు అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. దీంతో సర్కారు వారి పాట ప్రదర్శితం అవుతున్న థియేటర్లలో మహేష్ అభిమానులతో పాటు పవర్ స్టార్ అభిమానులు కూడా సందడి చేశారు.
- Advertisement -

సినిమా ప్రారంభంలో మహేష్ చిన్నతనంలో టాటూ వేయించుకునే సమయంలో.. ఏ పచ్చబొట్టు కావాలి అని ఓ ముసలావిడ అడుగుతుంది. కృష్ణది కావాలా.. చిరంజీవిది కావాలా అని ప్రశ్నిస్తుంది. చిరంజీవి పేరు వినిపించడంతో ఆ సమయంలో కూడా మెగాస్టార్ అభిమానులు విజిల్స్‌తో సందడి చేస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పాట రింగ్ టోన్ ఎందుకు పెట్టారన్న దానిపై డైరెక్టర్ పరుశురాం కీలక వ్యాఖ్యలు చేశాడు.

వేరే రింగ్ టోన్ పెడితే సరిగా ఆడియో వినిపించడం లేదని.. దీంతో తాను తమన్ కలిసి భీమ్లా నాయక్ రింగ్ టోన్ పెట్టాలని డిసైడ్ అయ్యామన్నారు. అలా పవర్ స్టార్ పాటను.. మహేష్ బాబు మూవీలో వాడేసామని చెప్పుకొచ్చారు డైరెక్టర్ పరుశురాం. త్వరలోనే.. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానని.. కళ్యాణ్ బాబును కలిసి మంచి కథ వినిపిస్తానన్నారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు.