Bheemla Nayak: భీమ్లా నాయ‌క్‌కు అదిరిపోయే ఆఫ‌ర్… గ‌త సినిమాల‌ని మించి బిజినెస్..!

Bheemla Nayak: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ప్ర‌స్తుతం తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాలంటే అభిమానుల‌లలో భారీ క్రేజ్ ఉంది. ఇంకా నిర్మాత‌లు ప‌వ‌న్‌తో సినిమాలు చేసేందుకు క్యూలు క‌డుతున్నారు. అయితే వ‌కీల్ సాబ్‌తో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్‌గా రూపొందుతుంది.


Bheemla Nayak Sold Audio Rights for Huge Offer
Bheemla Nayak Sold Audio Rights for Huge Offer


ప‌వన్‌ కళ్యాణ్‌, రానాలు హీరోలుగా తెరకెక్కుతోన్న భీమ్లా నాయక్‌ సినిమాకు సంబంధించి ఓ వార్త హల్చల్‌ చేస్తోంది. ఈ చిత్రం యొక్క ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. 5.04 కోట్ల రూపాయల తో ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.


గ‌తంలో ప‌వ‌న్ న‌టించిన జ‌ల్సా ఆడియో రైట్స్ 90 ల‌క్ష‌లకు అమ్ముడు పోగా, కొమురం పులి రెండు కోట్లు,అజ్ఞాత‌వాసి 2.9 కోట్లు రేట్ల‌కు అమ్ముడుపోయాయి. భీమ్లా నాయ‌క్ భారీ రేటుకి ఆడియో రైట్స్ ద‌క్కించుకోవ‌డం విశేషం. ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకునేందుకు అమేజాన్‌ ప్రైమ్‌ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అమేజాన్‌ ఇందు కోసం ఏకంగా రూ. 15 కోట్లు పెట్టనుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేటర్‌లలో విడుదలైన నెల రోజుల్లో అమేజాన్‌ ప్రైమ్‌లో రానుందని వార్తలు వస్తున్నాయి.


పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లో రానా దగ్గుపాటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా, ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.