Bheemla nayak: సంక్రాంతికి ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్‌తో వ‌చ్చిన భీమ్లా నాయ‌క్..ఖుష్ అవుతున్న మెగా ఫ్యాన్స్

Bheemla nayak: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌గ్గుబాటి రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కిస్తున్న చిత్రం భీమ్లా నాయ‌క్. 2022 సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’, ‘రాధే శ్యామ్’ చిత్రాల కారణంగా వెనక్కి వెళ్లింది. శివ రాత్రి కానుకగా ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. అయితే కోవిడ్ ఎఫెక్ట్‌తో ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్‌’, ‘రాధే శ్యామ్’ చిత్రాలు కూడా వెన‌క్కి వెళ్లాయి.

bheemla nayak release powerful poster1
bheemla nayak release powerful poster1

సంక్రాంతి సంద‌ర్భంగా సినిమాల ఎలాగు రాలేదు కాబ‌ట్టి పోస్ట‌ర్‌తో అభిమానుల‌కి పసందైన వినోదం పంచే ప్ర‌య‌త్నం చేశారు మేక‌ర్స్. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా క‌లిసి ఉన్న పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌గా, ఇందులో ఇద్ద‌రు చాలా సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తూ మూవీపై ఆస‌క్తిని పెంచారు. పోస్ట‌ర్‌పై ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ డేట్ రాసి ఉంది. ఆ స‌మ‌యానికి క‌రోనా కాస్త త‌గ్గితే మూవీని విడుద‌ల చేయడానికి మేక‌ర్స్ సిద్ధంగా ఉన్నారు.

అజ్ఞాతవాసి సినిమా తరువాత చాలా కాలం పాటు సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వకీల్ సబ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకున్నాడు.. పవర్ స్టార్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు అని ఆ సినిమాతో చాలా క్లియర్ గా అర్థమైంది. ఇక భీమ్లా నాయక్ సినిమాను కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ సినిమాను రెండు సార్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

భీమ్లా నాయ‌క్ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎడిటింగ్‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట.

bheemla nayak release powerful poster1
bheemla nayak release powerful poster1

అందులో భాగంగా ఎడిట్‌లో అనేక మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో త్రివిక్రమ్ సూచనల మేరకు టీమ్ మరోసారి చిత్రికరించే అవకాశం ఉందట. అసలైతే ఈ సంక్రాంతికి భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా వచ్చి ఉంటే మాత్రం వాతావరణం మరోలా ఉండేది అని చెప్పవచ్చు.