Bheemla nayak: సంక్రాంతి బ‌రిలోనే భీమ్లా నాయ‌క్.. ఆర్ఆర్ఆర్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధం

Bheemla nayak: త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత ’వకీల్ సాబ్’ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆయ‌న ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్స్, పాటలతో కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. దీంతో ఈ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతోందని అంటున్నారు.

bheemla nayak release on jan12th
bheemla nayak release on jan12th

ఈ సినిమా సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆర్ఆర్ఆర్ ఎంట్రీతో భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని వార్త‌లు వ‌చ్చాయి. ఫిబ్రవరి 24వ తేదిన రిలీజ్ కానుందంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే వాట‌న్నింటిని కొట్టి పారేస్తూ ముందుగా చెప్పిన తేదీకే అంటే జ‌న‌వ‌రి 12న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ మూడూ సంక్రాంతికి విడుదలయితే థియేటర్ల సమస్య వస్తుంది. పైగా ఎంత కాదన్నా రెవెన్యూ కూడా షేర్ అవుతుంది. కానీ తప్పని సరి పరిస్థితి. నిజానికి భీమ్లా నాయక్, రాధేశ్యామ్ ముందుగానే డేట్ లు ప్రకటించాయి. కానీ ఆర్ఆర్ఆర్ మాత్రం మధ్యలో వచ్చి దూరింది.

ఎప్పుడయితే ఆర్ఆర్ఆర్ చేసింది కరెక్ట్ కాదు అని అనలేరో? భీమ్లా నాయక్ ను రావద్దని అనలేరు. పైగా పండగ బరిలో దిగుతాం అని ముందుగా చెప్పి, ఇప్పుడు రాకుంటే ఎలా అనే హీరో పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.దీంతో జ‌న‌వ‌రి 12న చిత్రం విడుద‌ల కానుంద‌ని అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది

చిత్రం నుండి లాలా.. బీమ్లా.. అంటూ సాగే సాంగ్ త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా విడెద‌ల చేయ‌గా, ఈ పాట నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో రికార్డ్ వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. లైక్స్ పరంగా కూడా కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. వ్యూస్ పరంగా సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ వ్యూస్ ని 24 గంటల్లో సొంతం చేసుకుని బిగ్గెస్ట్ రికార్డ్‌ను నమోదు చేసింది.