Bheemla nayak: భీమ్లా నాయ‌క్ క‌న్నా ముందు మొద‌లైన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఇందుకు వాయిదా ప‌డిందా?

Bheemla nayak: ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తున్న విష‌యం తెలిసిందే. వ‌కీల్ సాబ్‌తో చివ‌రిగా ప‌ల‌క‌రించిన ప‌వ‌న్ ఇప్పుడ భీమ్లానాయ‌క్ అనే సినిమా చేస్తున్నాడు. రానా ద‌గ్గుబాటి కూడా ఇందులో మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియమ్‌కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, మాట‌లు రాయ‌డంతో పాటు ఏకంగా పాట కూడా రాసేశారు.

bheemla nayak pospone
bheemla nayak pospone

ఈ మూవీని ముందుగా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు రెడీ అయ్యారు. అయితే చివ‌రి నిమిషంలోఆర్ఆర్ఆర్ పోటీలోకి రావ‌డంతో జ‌న‌వ‌రి 26న విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ప‌వ‌న్ నటిస్తున్న మ‌రో చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

`హరిహర వీరమల్లు` యూనిట్ సభ్యులు కోవిడ్ బారిన పడటంతో షూటింగ్ బ్రేక్ పడింది. దీంతో పవన్ పూర్తిగా భీమ్లా నాయక్` సినిమాకే డేట్లు కేటాయించారు. దాదాపు ఆ సినిమా చిత్రీకరణ క్లైమాక్స్ కి చేరుకుంది. దీంతో `హరి హర వీరమల్లు` బ్యాలెన్స్ షూటింగ్ ని డిసెంబర్ నుంచి ప్రారంభించాలని దానికి తగ్గట్లు పవన్ డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా చిత్రీకరణ బ్రేక్ కి తాజాగా మరో బలమైన కారణం కూడా తెరపైకి వచ్చింది.`హరి హర వీరమల్లు` పిరియాడిక్ మూవీ కావడంతో భారీ సెట్లు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అందుకు బడ్జెట్ ఎక్కువగానే కేటాయించాల్సి ఉంది.

bheemla nayak pospone1 (1)
bheemla nayak pospone1 (1)

ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువగానే ఖర్చు అవుతుందని నిధులు సమకూర్చుకోవడం కూడా డిలే అవ్వడంతో వీరమల్లు ఇన్నాళ్లు వాయిదా వేసినట్లు వినిపిస్తోంది. డిసెంబర్ కల్లా అన్ని సెట్ అయిన నేపథ్యంలో తాజాగా పవన్ డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.