Bheemla nayak: ఈసారి కూడా మిస్ అవ్వదు.. పవన్ స్టామినాను తెలిపే ఫోటో..

Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే తెలుగు ప్రేక్షకులకు పండగ వచ్చినంత ఆనందం. ముఖ్యంగా ఆయన అభిమానులకైతే ఆ ఆనందం పీక్స్ కి చేరుకుంటుంది. పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్.

pawan kalyan statement7
pawan kalyan statement7

ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో తెలుస్తుంది. ఈ విషయం భీమ్లా నాయక్ డిక్లేర్ చేస్తుందనే విషయాన్ని ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ అన్నారు.

పవన్ కళ్యాణ్ కబడ్డీ ఆడుతున్న ఫోటోను ట్వీట్ చేస్తూ.. ఈ పదం గుర్తుంచుకోండి. ఈ సారి కూడా మిస్ అవ్వదు. 2022 జనవరి 12 న థియేటర్స్ లో చూడండి అంటూ ఓ మెసేజ్ ని కూడా పోస్ట్ చేశారు. ఈ ఫోటో క్షణాల్లో నెట్టింట్లో ట్రెండింగ్ గా మారింది.

పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ లాంటి అప్డేట్ పెట్టినందుకు నాగవంశీకి థ్యాంక్స్ చెబుతున్నారు. ఇక భీమ్లా నాయక్ సినిమా నుండి లేటెస్ట్ గా లాలా భీమ్లా అనే సాంగ్ కేవలం 24 గంటల్లో భారీ వ్యూస్ ని సంపాదించుకుని ట్రెండ్ ని సెట్ చేసారు.

ఈ రికార్డ్ ని ఇప్పటివరకు మరే హీరో బ్రేక్ చేయలేదు. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు డైరెక్షన్ వహిస్తున్నారు.