Bheemla Nayak: ప‌వ‌న్, నిత్యా మీన‌న్ మ‌ధ్య‌లో ఓ చిన్నారి.. క్రేజీ అప్‌డేట్ అదిరింది..!

Bheemla Nayak: వ‌కీల్ సాబ్ చిత్రం త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న చిత్రం భీమ్లా నాయ‌క్. క‌రోనా వేవ్ తరువాత స్పీడ్ అందుకున్న చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. పవన్ రాజకీయాలతోనూ బిజీగా ఉండటంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఇప్పటికే పవన్ కు సంబందించిన ప్రధాన పార్ట్ ను పూర్తిచేసుకున్నాడు. రానా – సంయుక్త మీనన్‌ సన్నివేశాలను తెరకెక్కించాల్సి వుంది.

చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రానా ద‌గ్గుబాటి స‌ర‌స‌న మ‌ల‌యాళ బ్యూటీ సంయుక్తా మీన‌న్ న‌టించ‌నున్నారు. సంయుక్తా మీన‌న్ న‌టించ‌నున్న తొలి తెలుగు చిత్ర‌మిదే. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె మ‌ల‌యాళం, త‌మిళ చిత్రాల్లోనే న‌టించారు.

సూర్య దేవర నాగ వంశీ నిర్మాతగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ సంభాషణలు & స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

చిత్రానికి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా చిత్రం నుండి సెకండ్ సాంగ్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. మొద‌టి సాంగ్‌కి మంచి రెస్పాన్స్ రాగా, అంతా ఇష్టం అనే సాంగ్‌ని అక్టోబ‌ర్ 15న విడుద‌ల చేయ‌నున్నారు. థ‌మ‌న్ సార‌ధ్యంలో రూపొందిన సాంగ్ శ్రోత‌ల‌ని త‌ప్ప‌క అల‌రించ‌నుంద‌ని అంటున్నారు.

అయితే ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్‌కి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నిత్యా మీన‌న్‌తో పాటు ఊయ‌ల‌లో ఓ చిన్నారి కూడా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఆ చిన్నారి వారి బాబు అని అర్ధ‌మ‌వుతుంది. అంటే సినిమాలో ఎమోష‌న్స్ బాగానే పండుతాయ‌ని తెలుస్తుంది.