Bheemla nayak: భీమ్లా నాయ‌క్ క్రేజీ అప్‌డేట్.. టీజ‌ర్, ట్రైల‌ర్స్ ఎప్పుడు విడుద‌ల కానున్నాయో తెలుసా?

Bheemla nayak: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భీమ్లా నాయ‌క్ ఒక‌టి. ఈ సినిమాను ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్నేహితుడు త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. రిలీజ్ డేట్ విష‌యంలో మేక‌ర్స్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

bheemla nayak carzy teaser1
bheemla nayak carzy teaser1

ఇప్పటికే విడుదలైన పాటలు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాయి. సంగీత దర్శకుడు తమన్ ఎప్పటిలానే మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటికి సంబంధించిన పాత్రల ఫస్ట్ లుక్ టీజర్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా క్లిక్కయ్యాయి.

మొత్తానికి ఫస్ట్ లుక్ టీజర్స్ చూస్తేనే సినిమా రిజల్ట్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తో పాటు ట్రైలర్ కూడా విడుదల కావాల్సి ఉంది. భీమ్లా నాయక్ టీజర్ రెడీ భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన టీజర్ ను రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు.

డిసెంబర్ 14న 37వ వసంతంలోకి అడుగుపెడుతున్న రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా ఒక పవర్ఫుల్ హై వోల్టేజ్ టీజర్ ను విడుదల చేయాలని ఇప్పటికే చిత్ర యూనిట్ ఒక ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం. దాదాపు టీజర్ ఫైనల్ కట్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది . జనవరి మొదటి వారంలో 1వ తేదీ లేదా 5వ తేదీన భీమ్లా నాయక్ నాయక్ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

bheemla nayak carzy teaser2
bheemla nayak carzy teaser2

ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే, భీమ్లా నాయ‌క్ రీ షూటింగ్ జ‌రుగుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సాధార‌ణంగా ఒక‌ట్రెండు రోజులు రీ షూటింగ్ అంటే మామూలుగానే ఎక్కువ సంద‌ర్భాల్లో జ‌రుగుతుంటాయి. కానీ, భీమ్లా నాయ‌క్ ఏకంగా 40రోజుల పాటు రీ షూట్‌ను జ‌రుపుకుంటుంద‌ట‌. ఇప్ప‌టికే కొన్ని రోజుల చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసేశార‌ని, మ‌రికొన్ని రోజులు చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంద‌ని స‌మాచారం.