Megastar Chiranjeevi : చిరంజీవితో గొడవ.. ఆ స్టార్భా హీరోయిన్ కెరీర్ సర్వనాశనం అయిందా..?
NQ Staff - February 17, 2023 / 10:20 AM IST

Megastar Chiranjeevi : అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది భానుప్రియ. ఆమె కండ్లతోనే ఎక్స్ ప్రెషన్లను పలికించగల సత్తా ఉన్న నటి. అందుకే ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. అయితే ఆమె అప్పట్లో డ్యాన్స్ లో మేటి అనిపించు కుంది. ఆమెకు అప్పట్లోనే భరతనాట్యం, కూచిపూటి లాంటి క్లాసిక్ డ్యాన్స్ లు కొట్టిన పిండి లాంటివి ఈ కారణంగానే ఆమెకు ఏ స్టెప్ అయినా ఈజీగా ఉండేది.
అప్పట్లో ఆమెతో డ్యాన్స్ చేయాలంటే మాస్టర్లు కూడా భయపడే పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఆమె ఏ స్టెప్ అయినా అలవోకగా వేసేసేది. హీరోలను కూడా ఆమె డామినేట్ చేసేసేది. అందుకే చాలామంది హీరోలు ఆమెతో సినిమాలు చేయాలంటే కాస్త భయపడిపోయేవారు. డ్యాన్స్ లో ఆమె ముందు తేలిపోతే బాగోదని చాలామంది ఆమెను దూరం పెట్టేవారు.
డామినేట్ చేయాలని..
ఆమె కూడా తనతో డ్యాన్స్ చేసే హీరోలను డామినేట్ చేయాలని చూసేది. ఆ క్రమంలోనే ఇండస్ట్రీలో అప్పుడు టాప్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కూడా డామినేట్ చేయాలని చాలాసార్లు ప్రయత్నించింది. అందుకే ఆమెను చిరు కూడా దూరం పెట్టాలని భావించాడంట. ఇదే విషయంపై అప్పట్లో చాలా రూమర్లు వచ్చాయి.
చిరంజీవి కూడా తనతో సినిమాలు చేసే నిర్మాతలు, దర్శకుతో భానుప్రియకు ఛాన్స్ ఇవ్వొద్దని ఒత్తిడి తెచ్చేవాడంట. దాంతో వారు కూడా చిరు మాట కోసం ఆమెను దూరం పెట్టేవారంట. అందుకే ఆమెకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. లేకపోతే విజయశాంతి లాగా ఆమె కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగేది.