TV Actor: ఫేస్ బుక్ లైవ్‌లో సూసైడ్ చేసుకున్న టీవీ న‌టుడు

TV Actor:గ‌త ఏడాదితో పాటు ఈ ఏడాది చిత్ర పరిశ్ర‌మ‌కు గ‌డ్డు రోజుల‌నే చెప్పాలి. క‌రోనా మ‌హమ్మారి విల‌య‌తాండం చేయ‌డం వ‌ల‌న షూటింగ్స్ ఆగిపోవ‌డంతో చాలా మంది సినీ కార్మికులు ఆక‌లితో అల‌మ‌టించారు. కొంద‌రు న‌టులు పొట్టకూటి కోసం రోడ్డెక్కారు. బిక్షాట‌న చేయ‌డం, కూరగాయ‌లు అమ్మ‌డం వంటివి చేశారు. ఇక క‌రోనా ప్ర‌ళ‌యంలో ఎంతో మంది లెజండ‌రీ స్టార్స్‌ని మ‌నం కోల్పోయాం. కొంద‌రు క‌రోనాతో చ‌నిపోతే మ‌రి కొంద‌రు అనారోగ్యంతో ఇంకొంద‌రు సూసైడ్ చేసుకొని చ‌నిపోయారు.

bengal TV Actor Suicide in Facebook Live
bengal TV Actor Suicide in Facebook Live

ఈ ఏడాదైన స‌క్ర‌మంగా ఉంటుంద‌ని అంద‌రు భావించిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ పాత రోజులే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అవే ఆక‌లి కేక‌లు, క‌రోనా మృత్యు ఘంటిక‌లు, సూసైడ్‌లు గురించి వినాల్సి వ‌స్తుంది. తాజాగా బెంగాలీ టీవీ ప‌రిశ్ర‌మ‌లో ఓ విషాదం చోటు చేసుకుంది. కరోనాతో గత కొన్ని రోజులగా సరైన అవకాశాలు లేక ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తోన్న సువో చక్రబర్తి అనే యువ నటుడు ఫేస్‌బుక్‌ లైవ్‌లో అభిమానులతో చిట్ ఛాట్ చేస్తూ ఆత్మహత్య హత్నానికి పాల్పడ్డాడు.

స‌కాలంలో స్పందించిన పోలీసులు అత‌న్ని ఆస్ప‌త్రిలో చేర్చి వైద్యం అందించ‌డంతో ప్రాణాల‌తోబ‌య‌ట‌ప‌డ్డాడు. జూన్ 8న జ‌రిగిన ఈ సంఘ‌ట‌న కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ‘మంగళ్ చాంది’ మరియు ’మానస’ వంటి సీరియల్స్‌తో బెంగాలీ ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైన సువో చక్రబర్తి జూన్ 8న అభిమానుల‌తో కొద్ది సేపు చాట్ చేశాడు. అవ‌కాశాలు లేక ఆర్ధికంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నాను. అందుకే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాను అని నిద్ర‌మాత్ర‌లు మింగాడు.

ఇది చూసిన ఫేస్ బుక్ యూజ‌ర్స్ వెంట‌నే పోలీసుల‌కు తెలిపారు. వారు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని హాస్పిటల్ త‌ర‌లించి అతని ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం సువో చక్రబర్తి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. గ‌త ఏడాది ఆగ‌స్ట్ నుండి సువో చక్రబర్తి అవ‌కాశాలు లేక ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. ఆర్ధికంగా ఇబ్బందులు ప‌డుతున్నాను అని చెప్పిన ఎవ‌రు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో సూసైడ్‌కు ప్ర‌య‌త్నించాను అని సువో చక్రబర్తి అన్నారు.