Sagar K Chandra : భీమ్లా నాయక్ మేకర్ కి ఎట్టకేలకు హీరో దొరికాడు
NQ Staff - January 25, 2023 / 04:52 PM IST

Sagar K Chandra : పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే కెరియర్ టర్న్ అయిపోయినట్లే అంటూ చాలా మంది దర్శకులు భావిస్తూ ఉంటారు. ఆయనతో ఒక్క సినిమా చేసే ఛాన్స్ వస్తే బాగుండు అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
సంవత్సరాలు తరబడి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు ఎదురు చూసిన దర్శకులు ఉన్నారు. కానీ దర్శకుడు సాగర్ చంద్ర పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన తర్వాత తదుపరి సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు.
భీమ్లా నాయక్ సినిమా ను పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పటి వరకు తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. ఈ మధ్య ఈయన దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించినందుకు ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతుంది.
వీరి కాంబోలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించి ప్రస్తుతానికి కథా చర్చలు జరుగుతున్నాయని సమాచారం అందుతుంది. హిందీలో చత్రపతి రీమేక్ చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అతి త్వరలోనే సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.