Movie Set: కోట్ల రూపాయలతో నిర్మించిన సెట్స్ కు వరుణుడి దెబ్బ

Movie Set: అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు యంగ్ అండ్ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తమిళ్ రీమేక్ రాక్షసుడుతో బ్రేక్ ఇచ్చినా.. తర్వాత వచ్చిన సినిమాలు అన్నుకున్న రీతిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అయ్యారు. అది కూడా తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఛత్రపతి రీమేక్ తో. యంగ్ రెబల్ హీరో ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా. అలాంటి పవర్ బ్యాకప్ లాంటి సినిమాతో బీటౌన్ దుమ్ము దులపడానికి రెడీ అయ్యారు.

Movie Set

ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సినిమాకి దర్శకత్వం వహించింది కూడా వి.వి. వినాయక్ కావడం విశేషం. దీనికోసం ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. షూటింగ్ కోసం హైదరాబాద్ నగర శివార్లలో దాదాపు 3 కోట్ల రూపాయలతో భారీ సెట్ ను నిర్మించారు. ఈ సెట్ లో యాక్షన్ సీన్స్ షూట్ చేయడానికి ప్లాన్ చేశారు ఫిల్మ్ టీమ్. మరి కొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభించాలనుకున్న నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ను వాయిదా వేశారు.

Movie Set

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ఛత్రపతి కోసం వేసిన సెట్ కి డ్యామేజ్ అయ్యింది. లాక్ డౌన్ తర్వాత ఈ సెట్ కి కొన్ని రిపేర్స్ చేయాల్సి ఉందని చిత్ర బృందం తెలిపింది. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మైదాన్ సినిమా కోసం నిర్మించిన భారీ సెట్ కూడా వర్షానికి తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. అసలే కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలవుతుంటే.. వర్షాలకు ఇలా భారీ సెట్లు పాడవడం నిర్మాతలకు మరింత నిరాశను కలిగిస్తోంది. ఇదిలా ఉండగా హిందీ ఛత్రపతి క్యారెక్టర్ కోసం సాయి శ్రీనివాస్ వర్కవుట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ కి స్ట్రాంగ్ ఎంట్రీ కోసం కాస్త గట్టిగానే కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. అలాగే హీరోయిన్, విలన్ లాంటి నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.