RRR : ఆర్ఆర్ఆర్ రిలీజ్‌కు ముందే ఎన్.టి.ఆర్, చరణ్ పాన్ ఇండియన్ సినిమాల లైనప్..!

RRR : ఆర్ఆర్ఆర్.. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ కరోనా క్రైసిస్ లేకపోయి ఉంటే గత ఏడాదే ప్రపంచ వ్యాప్తంగా రిలీజయ్యేది. కానీ సంవత్సరానికి పైనే పోస్ట్ పోన్ అయింది. ఇక ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగానూ భారీ స్థాయిలో అంచనాలు పెంచాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి తర్వాత ఇద్దరు స్టార్ హీరోలతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తుండటం అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.

before RRR release NTR, Ram charan pan indian movie lineup
before RRR release NTR, Ram charan pan indian movie lineup

దానికి తగ్గట్టే చరణ్, తారక్ పాత్రలను రివీల్ చేస్తూ టీజర్స్ వదిలారు. దాంతో మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్, బ్రిటన్ మోడల్ ఓవిలియా మోరిస్ సహా మిగతా భాషలలోని స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఆలియా భట్ పోషిస్తున్న సీత పాత్రను, అలాగే అజయ్ దేవగన్ పాత్రలను రిలీజ్ చేశారు. వీటీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలలో చరణ్, తారక్ కనిపించబోతున్నారు.

RRR : ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకుండానే పాన్ ఇండియన్ స్టార్స్‌గా క్రేజ్ వచ్చేసింది.

ఇద్దరికీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకుండానే పాన్ ఇండియన్ స్టార్స్‌గా క్రేజ్ వచ్చేసింది. దాంతో శంకర్ చరణ్‌తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. దిల్ రాజు నిర్మాత. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందనుంది. ఇక తారక్ బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమా చేయబోతున్నట్టు సన్నాహాలు జరుగుతున్నాయట, దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీతో సినిమా చేసేందుకు తారాక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆయన మార్క్ తో బాలీవుడ్‌లో రూపొందిన సినిమాల తరహాలోనే తారక్ తో చారిత్రాత్మక కథాంశంతో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి.