BB5 Siri : ముద్దుల గురించి ముచ్చ‌టించిన సిరి, శ్రీహాన్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్స్

BB5 Siri : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మంకు సంబంధించిన వార్త‌లు ప్రేక్ష‌కుల‌కి ఇంట్రెస్టింగ్‌గా మారాయి. హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి సంబంధించిన వార్త‌లు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. తాజాగా సిరికి సంబంధించిన ఓ వార్త ఆమెపై నెగెటివ్ కామెంట్స్ వ‌చ్చేలా చేస్తున్నాయి. తాను టెన్త్‌లో ఉన్నప్పుడే ఎదురింటి అబ్బాయితో లేచిపోయానని.. కొన్నాళ్లు అతనితో రిలేషన్‌లో ఉన్నట్టు చెప్పిన సిరి.. ఆ తరువాత తిరిగి ఇంటికి వచ్చానని.. అయితే కొన్నాళ్ళ తరువాత అతను చనిపోయాడాని తన ఫస్ట్ లవ్ స్టోరీని చెప్పింది.

TheNewsQube-
BB5 siri revealed her first kiss and dating with srihan
BB5 siri revealed her first kiss and dating with srihan

ఇక 19 ఏళ్ల వయసులో టీవీ నటుడు శ్రీహాన్ వెంటపడి మరీ ప్రేమించానని తను రిజెక్ట్ చేసినా అనుకున్నది సాధించానని ప్రస్తుతం అతనితో రిలేషన్‌లో ఉన్నట్టు చెప్పింది. ఇక శ్రీహాన్ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి సిరి బయటకు వచ్చిన తరువాత పెళ్లి చేసుకుంటానని బిగ్ బాస్ హౌస్‌కి లెటర్ కూడా పంపించాడు. ఆ లెటర్ చదివి సిరి తెగ మురిసిపోయింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లో ష‌ణ్ముక్‌తో ఈ అమ్మ‌డు చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు.

BB5 siri revealed her first kiss and dating with srihan
BB5 siri revealed her first kiss and dating with srihan

షణ్ముఖ్, సిరి. ఒకే బెడ్‌పై పడుకోవడం.. షణ్ముఖ్ గుండెలపై తలపెట్టుకుని మరీ ఒకే దుప్పటి కప్పుకోవడం.. జంట పాముల్లా ఎప్పుడూ హగ్ చేసుకునే ఉండటం లాంటి విన్యాసాలు ముదిరి.. ముదిరి లిప్ లాక్‌ల వరకూ వెళ్లింది. ఒకర్ని వదిలి ఒకరు ఉండలేనంతగా విరహంతో రగిలిపోయి తెగ రొమాన్స్ చేశారు. కన్ఫెషన్ రూంకి పిలిచి మరీ.. ఏంటి సిరి ఏమైంది? నీకు అంటే.. షణ్ముఖ్‌తో కనెక్ట్ అయిపోతున్నా.. తప్పని తెలిసినా తెలిసినా చేస్తున్నా.. ఎవరేం అనుకున్నా పర్లేదు.. నేను దాచుకోవడం లేదు..

బయట ఏంటో నాకు తెలుసు.. కానీ కనెక్షన్ వస్తోందో నాకు అర్థం కావడం లేదు. ఇది తప్పా రైటా? అని కూడా తెలియడం లేదు.. బ్యాడ్ అనుకుంటారా? గుడ్ అనుకుంటారా? అని కూడా ఆలోచించడం లేదు. తప్పు అని తెలిసినా కూడా చేసేస్తున్నా.. ఎలా రిసీవ్ చేసుకుంటారు అని కూడా ఆలోచించడం లేదు’ అని బరితెగించినట్టుగా మాట్లాడింది సిరి. అప్పటి వరకూ సిరిపై ఎంత నెగిటివ్ వచ్చినా.. కాస్తో కూస్తో మంచి అభిప్రాయాలు ఉండేవి.

కానీ తన క్యారెక్టర్‌ని తనకి తానుగా బయటపెట్టుకుని కోట్లాది మంది ప్రేక్షకుల ముందు సిరి క్యారెక్టర్ బ్యాడ్ అయ్యింది. ఓవైపు షణ్ముఖ్‌ దీప్తితో లవ్‌లో ఉన్నాడు.. సిరి కూడా శ్రీహాన్‌ని ప్రేమిస్తుంది. ఈ రెండు జంటలు రిలేషన్‌లో ఉండగా.. బిగ్ బాస్ హౌస్ లోపల వీరి ప్ర‌వ‌ర్త‌న‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. అయితే అసలు శ్రీహాన్‌ని పెళ్లి చేసుకుంటుందా? వీళ్లిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఉందా? లేదా అన్నదానిపై నెటిజన్లు వెతుకులాట మొదలు పెట్టారు.

సిరిని శ్రీహాన్ ఇంటర్వ్యూ చేసిన వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూ ఈ ఇద్దరూ రెచ్చిపోయారు. సిరి ఫస్ట్ కిస్.. డేటింగ్.. గిఫ్ట్స్ అబ్బో రచ్చ మామూలుగా లేదు. శ్రీహాన్ అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ చెప్తే దిండు తీసుకుని ఒక దెబ్బ కొడుతుందంట.. తప్పు చెప్తే ముద్దు పెట్టాలని శ్రీహాన్ అడగ్గా.. మొహమాటం లేకుండా కెమెరాముందే ముద్దులు పెట్టేసింది సిరి.

ఆ ఇంటర్వ్యూ ఎలా సాగిందంటే.. ‘ఏయ్ నువ్ నిజంగా అడుగుతున్నావా? నన్ను ముద్దు పెట్టమని.. ఇది ఇంటర్వ్యూ కదా సర్లే ఓకే డన్ ముద్దులకు రెడీ రెడీ అని సిరి అనేసింది. అయితే రా.. చూసుకుందా.. పిల్లోతో గుద్దులా లేదంటే ముద్దులా? అని ఇంటర్వ్యూ మొదలుపెట్టాడు శ్రీహాన్.

ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకుండా శ్రీహాన్ సిరికి ముద్దు పెట్టడానికి మీదికి వంగాడు. హేయ్ ఇది ఇంటర్వ్యూ అని తెగ నవ్వేస్తూ.. స్టార్ట్ చేయి.. అదే ఇంటర్వ్యూ అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వేసింది సిరి. మన ఫస్ట్ మీట్ ఎప్పుడు ఎక్కడ? అని శ్రీహాన్ అడగ్గా.. ‘షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్‌లో కలిశాం.. నేను గెస్ట్‌గా వచ్చాను.. ఫిబ్రవరి 20 రోజు నిన్ను కలిశాను’ అని చెప్పింది.

రెండో ప్రశ్నగా ‘నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు ఎక్కడా? అని అడగాడు శ్రీహాన్.. ఆ తరువాత తన ప్రశ్నని సవరిస్తూ.. నాతో నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు ఎక్కడ? అని అడిగాడు. దీంతో పెద్దగా నవ్విన సిరి.. హమ్మయ్య నీతో అని చెప్పి బతికించావ్.. నేను నా ఫస్ట్ కిస్ గురించి చెప్పడానికి రెడీ అయిపోయాను. థాంక్స్ కన్నా (శ్రీహాన్) నన్ను సేవ్ చేశావ్. నువ్ పెట్టిన ప్రతి ముద్దు నాకు మధురమే. నాకు సరిగా గుర్తు లేదు అని చెప్పింది.

మూడో ప్రశ్నగా.. మనం ఫస్ట్ డేట్‌కి వెళ్లింది ఎప్పుడు? ఎక్కడికి అని శ్రీహాన్ అడగ్గా.. ‘అరేయ్ నువ్ ఎప్పుడ్రా నన్ను డేట్‌కి తీసుకుని వెళ్లింది.. ఎన్నిసార్లు అడిగాను డేట్‌కి తీసుకుని వెళ్లరా అని తీసుకుని వెళ్లావా? ఏడేళ్లలో ఒక్కసారైనా డేట్‌కి తీసుకుని వెళ్లావా? నేను గోవా తీసుకుని వెళ్లమని ఎప్పటినుంచో అడుగుతున్నా.. ఇప్పటివరకూ తీసుకుని వెళ్లలేదు అని చెప్పింది సిరి..