BB3 : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన ఫేవరేట్ దర్శకుడు బోయపాటి శీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బీబీ 3 అనే టైటిల్‌తో కొన్నాళ్ళుగా ఈ మూవీ ప్రచారం జరుపుకుంటుంది. ఇందులో బాలకృష్ణ అఘోరాగా కనిపించనున్నాడని, ఈ సినిమాకు ”మోనార్క్, సూపర్ మ్యాన్” అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పూర్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.
బాలకృష్ణ- బోయపాటి సక్సెస్ఫుల్ కాంబోలో హాట్రిక్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బాలయ్య కెరీర్లో 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. ఈ చిత్ర రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, కొద్ది సేపటి క్రితం అఫీషియల్ ప్రకటన చేశారు. మే 28న థియేటర్స్‌లో గర్జించనున్నాడని తెలిపారు. బాలయ్య ప్రకటనతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌లో ఉన్నారు.