Bangarraju : చిన్న బంగార్రాజు చిత‌కొట్టేశాడుగా… టీజ‌ర్ అదిరింది..!

Bangarraju : అక్కినేని నాగార్జున‌, నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కిస్తున్న చిత్రం బంగార్రాజు. ‘సోగ్గాడే చిన్ని నాయన’కు ఇది ప్రీక్వెల్‌గా వస్తోంది. ఇది అక్కినేని మల్టీస్టారర్‌గా రూపొందుతోంది. దాదాపు మూడు నాలుగేళ్ల క్రితమే ‘బంగార్రాజు’ ప్రాజెక్టు బాధ్యతను కల్యాణ్ కృష్ణకు అప్పగించాడు నాగార్జున. ఈ క్రమంలోనే ఇది అక్కినేని హీరోల మల్టీస్టారర్ మూవీగా వస్తుందన్న టాక్ కూడా వినిపించింది.

Bangarraju teaser naga chaitanya look super
Bangarraju teaser naga chaitanya look super

కానీ, స్క్రిప్ట్ సరిగా లేకపోవడం వల్లో.. మరే ఇతర కారణాల వల్లో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే దీన్ని అధికారికంగా మొదలు పెట్టేశారు. రెగ్యూలర్ షూటింగ్ మొదలైన తర్వాత దీన్ని ఎంతో వేగంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేసుకున్నారు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నాగార్జున ప్రకటించారు.

సోషియో ఫాంటసీ నేపథ్యంతో క్రేజీ సబ్జెక్టుతో అక్కినేని మల్టీస్టారర్‌గా రాబోతున్న ‘బంగార్రాజు’ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం అప్పుడే ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి బంగార్రాజు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిన్న‌ విడుదల చేశారు. ఇందులో ఊహించని విధంగా అక్కినేని నాగ చైతన్యను చూపించారు. తద్వారా ఇందులో బంగార్రాజు నాగార్జున కాదు.. నాగ చైతన్య అని వెల్లడించి ప్రేక్షకులకు షాకిచ్చారు.

తాజాగా టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో నాగ చైత‌న్య‌ అదిరిపోయే లుక్‌లో కేక పెట్టించారు. అక్కినేని అభిమానులు కోరుకునే అన్ని హంగులతో సినిమాను తీర్చిదిద్దుతున్నారు. సంక్రాంతి రేసులో నిలపడమే లక్ష్యంగా చిత్రాన్ని శరవేగంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే పండగ బెర్తులన్నీ ఖరారైన నేపథ్యంలో ఈ సినిమాకి చోటుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.