Bangarraju : బంగార్రాజు నుండి కృతి లుక్ ఔట్‌.. నాగ‌ల‌క్ష్మీగా అదిరిపోయింది..!

Bangarraju : ఉప్పెన సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. తొలి సినిమాతోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ అమ్మ‌డు వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ అందుకుంటుంది. నాని, సుధీర్ బాబు, నితిన్, రామ్ సినిమాల్లో నటిస్తున్న కృతి శెట్టి నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న బంగార్రాజు సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది.

bagaruraju coming soon
bagaruraju coming soon

సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తుందని తెలిసిందే.సినిమాలో వీరిద్దరి ట్రాక్ బాగుంటుందని అంటున్నారు. ఇక సినిమా నుండి నాగార్జున లుక్ తో పాటుగా ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు.ఇక లేటెస్ట్ గా సినిమా నుండి కృతి శెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. లేడీస్ ఫ‌స్ట్ అందుకే కృతి ఫొటో విడుద‌ల చేస్తున్నామంటూ తెలిపారు. పోస్ట‌ర్‌లో కృతి శెట్టి ఆక‌ట్టుకునేలా ఉంది.

ఉప్పెనతో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న కృతి శెట్టి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చెప్పొచ్చు.చైతు, కృతి శెట్టిల జోడీ సినిమాకు హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.

2003, సెప్టెంబరు 21న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించింది కృతి శెట్టి. చిన్నప్పటినుంచే పలు యాడ్స్‌తో తన ప్రత్యేకతను చాటుకుంది. ఐడియా, షాప్పర్స్ స్టాప్, పార్లే, లైఫ్ బాయ్, బ్లూ స్టార్ వంటి సంస్థల యాడ్స్ లో అలరించింది. మోడ‌లింగ్‌ అలా మొదలు పెట్టిందో లేదో హిందీలో 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘సూపర్ 30’ సినిమాలో విద్యార్థిగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

bagaruraju coming soon1 (1)
bagaruraju coming soon1 (1)

ఆ తరువాత తొలిసారిగా 2021 తెలుగు సినిమా “ఉప్పెన” ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తో చాన్స్‌కొట్టేసి, యూత్‌ క్రష్‌గా మారిపోయింది. ఒకదశలో సూపర్ జోడి నిజ జీవితంలో కూడా జతకడితే బావుండు అన్నంతగా మారిపోయారు క్రేజీ కపుల్‌. అంతేకాదు ఉప్పెన మూవీ పాటలు కూడా అంతే పాపులర్‌ అయ్యాయి. అలాగే ఈ మూవీలోని ‘ఈశ్వరా.. పరమేశ్వరా’ పాటకు శివరాత్రి సందర్భంగా స్పెషల్‌ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది