Krithi Shetty : బంగార్రాజు డైరీలో దాగి ఉన్న కృతి అందం.. బేబ‌మ్మ ఆనందానికి అవ‌ధులు లేవు

Krithi Shetty : నాగార్జున‌- క‌ళ్యాణ్ కృష్ణ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా.ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ.. చైకు జోడీగా కృతి శెట్టి సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగార్రాజు నుంచి కృతి లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

bangarraju krithi shetty look
bangarraju krithi shetty look

ఇందులో నాగలక్ష్మి పాత్రలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకెళ్తుంది కృతి శెట్టి. తాజాగా బంగార్రాజు సినిమాలో నాగచైతన్య సరసన నటిస్తోంది. ఇటీవల కృతికి సంబంధించిన పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసిన నాగలక్ష్మి లుక్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నికల్లో గెలిచి విజయకేతనం ఎగరేస్తున్నట్లుగా కృతిశెట్టి కనిపించింది.

తాజాగా చిత్రయూనిట్ మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. బంగార్రాజు డైరీలో ఇంత అందం ఉందా ? అంటూ బంగార్రాజు డైరీకి సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది. అందులో కృతి శెట్టి ఫోటోను రిలీజ్ చేశారు. అయితే బంగార్రాజు చిత్రయూనిట్ చేసిన పోస్ట్ పై కృతి శెట్టి స్పందించింది. తన మీద ఇంతలా ప్రేమ కురిపించినందుకు ఎమోషనల్ ట్వీట్ చేస్తూ… అభిమానులకు.. బంగార్రాజు టీంకు థ్యాంక్స్ చెప్పింది.

సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు. ఇటీవల రిలీజ్ చేసిన నాగార్జున ఫస్ట్‌లుక్, అలాగే ఆయన పాడిన ‘లడ్డుండా’ పాటకు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు విడుద‌లైన కృతి ఫ‌స్ట్ లుక్ కూడా అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది.